SRH vs KKR: క్రిస్‌లీన్ హాఫ్ సెంచరీ... మంచి స్కోరు సాధించిన కోల్‌కతా...

IPL 2019 Live Score, SRH vs KKR Match in Hyderabad: ఖలీల్ అహ్మద్‌కు మూడు వికెట్లు... రెండు వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్,

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 21, 2019, 6:03 PM IST
SRH vs KKR: క్రిస్‌లీన్ హాఫ్ సెంచరీ... మంచి స్కోరు సాధించిన కోల్‌కతా...
ఆ జట్టులో 200-250 పరుగులు చేయగల బాట్స్‌మెన్స్ లేరు. 150 పరుగులకే ఆ జట్టు పరిమితమవుతుంది. ముంబై 200కు పైగా రన్స్ చేస్తే మ్యాచ్ వన్‌సైడ్ కానుంది'అని సెహ్వాగ్ కామెంట్ చేశాడు
  • Share this:
IPL 2019 Live Score, SRH vs KKR Match in Hyderabad: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగుల గౌరవప్రదమైన స్కోరు నమోదుచేసింది. ఆరంభంలో సునీల్ నరైన్, క్రిస్‌లీన్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 2.3 ఓవర్లలోనే 42 పరుగుల సాధించిన కోల్‌కతాకు ఖలీల్ అహ్మద్ గట్టి సాక్ ఇచ్చాడు. 8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన సునీల్ నరైన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన ఖలీల్ అహ్మద్... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శుబ్‌మన్ గిల్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 11 పరుగులు చేసిన నితీశ్ రాణాను భువనేశ్వర్ కుమార్ అవుట్ చేయగా... దినేశ్ కార్తీక్ (6 పరుగులు) రనౌట్ అయ్యాడు. 73 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది కోల్‌కతా నైట్‌రైడర్స్. ఆ తర్వాత యంగ్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్‌తో కలిసి జోరు కొనసాగించాడు క్రిస్‌లీన్. ఐదో వికెట్‌కు ఈ ఇద్దరూ కలిసి 51 పరుగులు జోడించారు. ఈ దశలో 25 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన రింకూ సింగ్, సందీప్ శర్మ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి, రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

46 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్‌తో క్రిస్‌లీన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో అతనికి ఇది తొమ్మిదో హాఫ్ సెంచరీ. ఆ తర్వాతి బంతికే భారీ షాట్ ఆడిన క్రిస్ లీన్‌ను, అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు కేన్ విలియంసన్. ఆ తర్వాత భువనేశ్వర్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదిన రస్సెల్ (15 పరుగులు)... అదే ఓవర్లో రషీద్ ఖాన్‌ను క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆఖరి ఓవర్ వేసిన రషీద్ ఖాన్, పియూష్ చావ్లా (4 పరుగులు)ను అవుట్ చేశాడు. అయితే కరియప్ప ఆఖర్లో ఓ సిక్స్‌ కొట్టడంతో కోల్‌కతా జట్టు 159 పరుగుల వద్ద ఆగింది. ఖలీల్ అహ్మద్‌కు మూడు వికెట్లు దక్కగా, భువనేశ్వర్ కుమార్‌కు రెండు, రషీద్ ఖాన్, సందీప్ శర్మకు చెరో వికెట్ దక్కాయి.
Published by: Ramu Chinthakindhi
First published: April 21, 2019, 5:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading