MI vs RR: ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్... మ్యాచ్‌కు ముందు సంచలన నిర్ణయం...

MI vs RR Match at Wankhede: అజింకా రెహానేపై వేటు వేసి, స్టీవ్ స్మీత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు... గాయం కారణంగా మ్యాచ్ నుంచి తప్పుకున్న జోస్ బట్లర్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 20, 2019, 4:06 PM IST
MI vs RR:  ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్... మ్యాచ్‌కు ముందు సంచలన నిర్ణయం...
MI vs RR Match at Wankhede: అజింకా రెహానేపై వేటు వేసి, స్టీవ్ స్మీత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు... గాయం కారణంగా మ్యాచ్ నుంచి తప్పుకున్న జోస్ బట్లర్...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 20, 2019, 4:06 PM IST
IPL 2019 Live Score, RR vs MI Match at Jaipur: ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు కెప్టెన్
స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటిదాకా కేవలం రెండు విజయాలతో టేబుల్‌లో కింది నుంచి రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్... కెప్టెన్సీలో మార్పు చేసింది. అజింకా రెహానేపై వేటు వేసి, స్టీవ్ స్మీత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. రాజస్థాన్ రాయల్స్ సాధించిన రెండు విజయాల్లో ఒకటి ముంబై ఇండియన్స్‌పైనే కావడం విశేషం. రాయల్స్ బ్యాటింగ్‌లో రాణిస్తున్నా, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఆ జట్టు చేస్తున్న తప్పిదాలు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నాయి. ఇప్పటికే 8 మ్యాచుల్లో 6 మ్యాచులు ఓడిన రాజస్థాన్... టాప్ 4లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఇకపై ఆడబోయే మ్యాచులన్నీ కీలకం కానున్నాయి. దాంతో రెహానెను కెప్టెన్‌గా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది రాజస్థాన్. అయితే రాయల్స్ టీమ్‌గా అద్భుతంగా రాణిస్తున్న ఒకే ఒక్క బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌ నుంచి దూరమయ్యాడు.

రాజస్థాన్ జట్టు: అజింకా రహానే, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, బెన్ స్టోక్స్, టర్నర్, స్టువర్ట్ బిన్నీ, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనద్కడ్, దవల్ కులకర్ణి,

ముంబై జట్టు: డి కాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, పోలార్డ్, కృనాల్ పాండ్యా, హర్ధిక్ పాండ్యా, రాహుల్ చాహార్, బుమ్రా, బెన్ కట్టింగ్, మయాంక్ మర్కండే, మలింగ

First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...