RR vs MI: ముంబైని కట్టడి చేసిన రాజస్థాన్ రాయల్స్... డి కాక్ ఇన్నింగ్స్‌ కారణంగా...

RR vs MI: 65 పరుగులు చేసిన డి కాక్, సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులు... రాజస్థాన్ రాయల్స్‌కు కలిసొచ్చేలా కనిపిస్తున్న కెప్టెన్సీ మార్పు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 20, 2019, 6:40 PM IST
RR vs MI: ముంబైని కట్టడి చేసిన రాజస్థాన్ రాయల్స్... డి కాక్ ఇన్నింగ్స్‌ కారణంగా...
RR vs MI: 65 పరుగులు చేసిన డి కాక్, సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులు... రాజస్థాన్ రాయల్స్‌కు కలిసొచ్చేలా కనిపిస్తున్న కెప్టెన్సీ మార్పు...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 20, 2019, 6:40 PM IST
IPL 2019 Live Score, RR vs MI Match at Jaipur: టాస్ ఓడి, బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఓపెనర్లు నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో మొదటి రెండు ఓవర్లలో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. మూడో ఓవర్‌‌లో ఫోర్ కొట్టిన రోహిత్ శర్మ (5 పరుగులు), తర్వాతి బంతికే అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో అవుట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న డి కాక్, ధవల్ కుల్‌కర్ణి వేసిన నాలుగో ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్‌తో 19 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి, దూకుడు కొనసాగించాడు డి కాక్. ఇద్దరూ కలిసి 13వ ఓవర్‌లో జట్టు స్కోరు 100 పరుగులు దాటించారు. రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు. 33 బంతుల్లో 34 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, బిన్నీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే డి కాక్ కూడా అవుట్ అయ్యాడు. 47 బంతుల్లో 2 సిక్సర్లు, 6 ఫోర్లతో 65 పరుగులు చేసిన డి కాక్, శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి, స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత 10 పరుగులు చేసిన పోలార్డ్‌ను జయదేవ్ ఉనాద్కడ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. బ్యాట్స్‌మెన్‌కు తగ్గట్టుగా బౌలర్లను మారుస్తూ కెప్టెన్ స్టీవ్ స్మిత్... మంచి ఫలితం రాబట్టాడు.

అయితే కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన ఆర్చర్... ఫీల్డింగ్‌కు మూడు క్యాచులు జారవిడిచాడు. ముఖ్యంగా అతను క్యాచ్ వదిలేయడంతో రెండు సార్లు బతికిపోయిన హర్దిక్ పాండ్యా... అతని బౌలింగ్‌లోనే అవుట్ అవ్వడం విశేషం. 15 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 23 పరుగులు రాబట్టాడు హార్ధిక్ పాండ్యా. కటింగ్ చివరి బంతికి సిక్స్ సాధించడంతో 160 పరుగుల స్కోరు దాటింది ముంబై ఇండియన్స్.

First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...