RR vs DC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ... రాజస్థాన్ బ్యాటింగ్...

IPL 2019 Live Score, RR vs DC at Jaipur: పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కొట్టేయాలని ఢిల్లీ టీమ్... గెలిచి ప్లేఆఫ్ పోటీలో నిలవాలని రాజస్థాన్...

IPL 2019 Live Score, RR vs DC at Jaipur: పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కొట్టేయాలని ఢిల్లీ టీమ్... గెలిచి ప్లేఆఫ్ పోటీలో నిలవాలని రాజస్థాన్...

  • Share this:
IPL 2019 Live Score, RR vs DC at Jaipur: రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడిన మొదటి మ్యాచ్‌లోనే విజయం సాధించిన రాజస్థాన్... ఆ జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కొట్టేయాలని యంగ్ ఢిల్లీ టీమ్ ఆశగా ఎదురుచూస్తోంది. గత మ్యాచ్‌లో మూడు వికెట్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సందీప్ లామిచానె స్థానంలో క్రిస్ మోరిస్‌కు అవకాశం కల్పించాడు శ్రేయాస్ అయ్యర్. రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా బరిలో దిగుతోంది.

ఢిల్లీ జట్టు: పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కోలిన్ ఇన్‌గ్రామ్, క్రిస్ మోరిస్, రూథర్‌ఫర్డ్, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, రబాడా, ఇషాంత్ శర్మ

రాజస్థాన్ జట్టు: అజింకా రెహానే, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, రియాన్ పరాగ్, టర్నర్, స్టువర్ట్ బిన్నీ, శ్రేయాస్ గోపాల్, ఆర్చర్, జయదేవ్ ఉనాద్కడ్, ధవల్ కుల్‌కర్ణి.
First published: