RR vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఉత్కంఠ విజయం... చివరి బంతిదాకా సాగిన మ్యాచ్...

IPL 2019 Live Score, RR vs CSK at Jaipur: ధోనీ, అంబటి రాయుడు హాఫ్ సెంచరీలు... చివరి ఓవర్లో కొనసాగిన హైడ్రామా...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 12, 2019, 7:52 AM IST
RR vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఉత్కంఠ విజయం... చివరి బంతిదాకా సాగిన మ్యాచ్...
IPL 2019 Live Score, RR vs CSK at Jaipur: ధోనీ, అంబటి రాయుడు హాఫ్ సెంచరీలు... చివరి ఓవర్లో కొనసాగిన హైడ్రామా...
  • Share this:
IPL 2019 Live Score, RR vs CSK at Jaipur: ఐపీఎల్ 12 సీజన్‌లో మరో మ్యాచ్ చివరిదాకా ఉత్కంఠ రేపింది. ఆఖరి బంతిదాకా దోబూచులాడిన హోరాహోరీ పోరులో ధోనీ జట్టుకే విజయం దక్కింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు... ప్రారంభంలో వరుస వికెట్లు కోల్పోయింది. షేన్ వాట్సన్‌ను డకౌట్ చేసిన కులకర్ణి... చెన్నైకి గట్టి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత డుప్లిసిస్ 7 పరుగులు, సురేశ్ రైనా 4 పరుగులు, కేదార్ జాదవ్ 1 పరుగు చేసి వెంటవెంటనే అవుట్ కావడంతో 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు, ధోనీతో కలిసి 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన అంబటి రాయుడు, స్టోక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ధోనీ జట్టు విజయానికి 12 పరుగులు కావల్సిన దశలో అవుట్ కావడంతో విజయంపై ఉత్కంఠ నెలకొంది. చివరి ఓవర్‌ మూడో బంతికి ధోనీ అవుట్ కావడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేగింది. ఈ దశలో అంపైర్లు నో బాల్ ప్రకటించి, తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడంతో వివాదం రేగింది. అవుటై పెవిలియన్ కూడా చేరిన చెన్నై కెప్టెన్ క్రీజులోకి వచ్చి మరీ అంపైర్లతో గొడవకు దిగాడు.

3 బంతుల్లో 8 పరుగులు కావల్సిన దశలో సాంట్నర్ రెండు డబుల్స్ తీశాడు. తర్వాతి బంతి వైడ్ వెళ్లడంతో చివరి బంతికి 3 పరుగులు కావల్సిన దశలో సాంట్నర్ సిక్సర్ సాధించి, చెన్నైకి విజయాన్ని అందించాడు.

IPl 2019 Live Cricket Score,IPL 2019 Live Score, RR vs CSK, Rajastan royals vs Chennai super kings, Rajasthan Royals ipl 2019, csk ipl 2019, MI vs KXIP, mumbai indians ipl 2019, kings xi punjab ipl 2019, rohit sharma injury, bumrah, lasith malinga ipl 2019, pandya brothers, Chris Gayle ipl 2019, R Ashwin Mankading incident, ఐపిఎల్ లైవ్ స్కోరు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ లైవ్, ముంబై vs పంజాబ్, ముంబై ఇండియన్స్ ఐపిఎల్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఐపీఎల్ 2019, రోహిత్ శర్మ ఐపీఎల్, ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ 2019, మహేంద్రసింగ్ ధోనీ, రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, అజింకా రహానే
43 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేసిన ధోనీ



అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. అజింకా రహానె 14 పరుగులు, బట్లర్ 23 పరుగులు, స్టీవ్ స్మిత్ 15 పరుగులు చేయగా బెన్ స్టోక్స్ 28 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్క్, శ్రేయాస్ గోపాల్ చివర్లో బౌండరీలు సాధించడంతో 150 పరుగుల మైలు రాయి దాటింది రాజస్థాన్ రాయల్స్. శ్రేయాస్ గోపాల్ 7 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేయగా, ఆర్క్ 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.


POINTS TABLE:


SCHEDULE TIME TABLE:

ORANGE CAP:


PURPLE CAP:


RESULTS TABLE:


వారిద్దరూ ఓల్డ్ వైన్ లాంటివాళ్లు, ఏజ్ పెరిగేకొద్దీ... మహేంద్ర సింగ్ ధోనీ కామెంట్స్...


First published: April 12, 2019, 7:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading