RR vs CSK: రాణించిన చెన్నై బౌలర్లు... స్వల్ప స్కోరుకే పరిమితమైన రాజస్థాన్...

IPL 2019 Live Score, RR vs CSK at Jaipur: ఐపీఎల్ కెరీర్‌లో వంద వికెట్లు మైలురాయిని అందుకున్న రవీంద్ర జడేజా...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 11, 2019, 10:22 PM IST
RR vs CSK: రాణించిన చెన్నై బౌలర్లు... స్వల్ప స్కోరుకే పరిమితమైన రాజస్థాన్...
ఆ మ్యాచ్‌లో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చి ఫామ్‌లోకి రాకపోతే.. చెన్నై టీమ్‌పై ఫ్యాన్స్ మరింతగా ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది.
  • Share this:
IPL 2019 Live Score, RR vs CSK at Jaipur: బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుపై సాధించిన ఒక్క విజయం తప్ప, మరో విజయం దక్కని రాజస్థాన్ రాయల్స్... మరోసారి నిరాశజనిత ప్రదర్శనే ఇచ్చింది. చెన్నైతో సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. మొదటి ఓవర్ నుంచే బట్లర్, రహానే కలిసి దూకుడుగా బ్యాటింగ్ మొదలెట్టారు. అయితే మూడో ఓవర్లో రహానేను అవుట్ చేసిన దీపక్ చాహార్ రాజస్థాన్‌కు తొలి షాక్ ఇచ్చాడు. 14 పరుగులు చేసిన రహానే ఎల్బీడబ్లూగా అవుటై వెనుదిరిగాడు. మొదట అంపైర్లు రహానేను అవుట్ ఇవ్వకపోయినా, ధోనీ రివ్యూకి వెళ్లడంతో చెన్నైకి అనుకూలంగా ఫలితం వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే శార్దూల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన బట్లర్ (23 పరుగులు), రాయుడికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 47 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది రాజస్థాన్. ఆ తర్వాత కొద్దిసేపటికే సంజూ శాంసన్ కూడా 6 పరుగులు చేసి అవుట్ కాగా, రాహుల్ త్రిపాఠి 10 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 69 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో పడింది. 15 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ కూడా జడేజా బౌలింగ్‌తో రాయుడికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. స్మిత్ వికెట్ తీయడం ద్వారా ఐపీఎల్ కెరీర్‌లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు రవీంద్ర జడేజా. కొద్దిసేపటి తర్వాత కొత్త కుర్రాడు రియాన్ పరాగ్ కూడా 16 పరుగులు చేసి, పెవిలియన్ చేరాడు.

నెమ్మదిగా ఆడుతూ 28 పరుగులు చేసిన బెన్ స్టోక్స్... చాహార్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఆర్క్, శ్రేయాస్ గోపాల్ చివర్లో బౌండరీలు సాధించడంతో 150 పరుగుల మైలు రాయి దాటింది రాజస్థాన్ రాయల్స్. శ్రేయాస్ గోపాల్ 7 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేయగా, ఆర్క్ 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

POINTS TABLE:


SCHEDULE TIME TABLE:


ORANGE CAP:

PURPLE CAP:


RESULTS TABLE:


వారిద్దరూ ఓల్డ్ వైన్ లాంటివాళ్లు, ఏజ్ పెరిగేకొద్దీ... మహేంద్ర సింగ్ ధోనీ కామెంట్స్...


Published by: Ramu Chinthakindhi
First published: April 11, 2019, 9:36 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading