RR vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ... రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్...

RR vs CSK: రెండో విజయం కోసం ఎదురుచూస్తున్న రాజస్థాన్ రాయల్స్... టాప్ ప్లేస్‌లో ఉన్న ధోనీ టీమ్‌తో పోటీకి సై...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 11, 2019, 7:45 PM IST
RR vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ... రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్...
2018 మే 22న జరిగిన మ్యాచ్‌లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.
  • Share this:
RR vs CSK: చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి చెన్నై కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు... పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న చెన్నైకీ, ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ మధ్య పోరు ఎలా సాగుతుందోనని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ నుంచైనా పుంజుకోవాలని రాజస్థాన్ కోరుకుంటోంది. ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో మార్పులతో బరిలో దిగుతున్నాయి. చెన్నై జట్టులో హర్భజన్ సింగ్, స్కాట్‌ చోటు కోల్పోయారు. వారి స్థానంలో సాంట్నర్, శార్దూల్ జట్టులోకి వచ్చారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజూ శాంసన్ గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇవ్వగా, రియాన్ పరాగ్ మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు.

చెన్నై జట్టు: ధోనీ, షేన్ వాట్సన్, డుప్లిసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, జాదవ్, జడేజా, దీపక్ చాహార్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాగూర్, ఇమ్రాన్ తాహీర్

రాజస్థాన్ జట్టు: అజింకా రహానే, బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి, బెన్ స్టోక్స్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్క్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనద్కడ్, దవల్ కులకర్ణి
First published: April 11, 2019, 7:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading