RCB vs RR: శ్రేయాస్ గోపాల్ హ్యాట్రిక్... అయినా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు... రాజస్థాన్ ఫ్లేఆఫ్ ఆశలు కష్టమే...

రాజస్థాన్ విజయానికి 22 పరుగుల దూరంలో మళ్లీ కురిసిన వాన... రాజస్థాన్ రాయల్స్ ఫ్లేఆఫ్ ఆశలు సంక్లిష్టం... అధికారికంగా రేస్ నుంచి తప్పించుకున్న విరాట్ టీమ్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 1, 2019, 10:51 AM IST
RCB vs RR: శ్రేయాస్ గోపాల్ హ్యాట్రిక్... అయినా వర్షం కారణంగా మ్యాచ్ రద్దు... రాజస్థాన్ ఫ్లేఆఫ్ ఆశలు కష్టమే...
సంజూ శాంసన్
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 1, 2019, 10:51 AM IST
IPL 2019 Live Score, RCB vs RR Match at Bengaluru: మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచి ఫ్లేఆఫ్ రేసులో నిలవాలన్న రాజస్థాన్ రాయల్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఇప్పటికే సంక్లిష్టంగా మారిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌ను అధికారికంగా ఆ రేసు నుంచి దూరం చేశాడు. పడుతూ, తగ్గుతూ దోబూచులాడుతూ వాన... ఎట్టకేలకు తగ్గుముఖం పట్టడంతో చాలా ఆలస్యంగా ప్రారంభమైంది మ్యాచ్. వర్షం కారణంగా చాలా సమయం వృథా కావడంతో మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. 5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన విరాట్ సేన... రాజస్థాన్ రాయల్స్ ముందు 63 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్య చేధనను ధాటిగానే ఆరంభించిన రాజస్థాన్ రాయల్స్ 3.2 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 41 పరుగుల చేసి... విజయదిశగా దూసుకుపోతున్నట్టే కనిపించింది. సంజూ శాంసన్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 28 పరుగులు చేసి అవుట్ కాగా, లివింగ్‌స్టోన్ 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ దశలో మళ్లీ వర్షం కురవడంతోత మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు అంపైర్లు.

అంతకు ముందు టాస్ ఓడి, బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. బెంగళూరు ఓపెనర్లు క్రీజులోకి వస్తూనే భారీ షాట్స్ ఆడడంతో 1.3 ఓవర్లలోనే 35 పరుగులు రాబట్టింది రాయల్ ఛాలెంజర్స్. అయితే రెండో ఓవర్‌ చివరి మూడు బంతుల్లో హ్యాట్రిక్ తీసిన శ్రేయాస్ గోపాల్... బెంగళూరుకు ఊహించని షాక్‌‌ని ఇచ్చాడు. 7 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సర్లతో 25 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 10 పరుగులు చేసిన డివిల్లియర్స్ వరుస బంతుల్లో పెవిలియన్ చేరగా... స్టోయినిస్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత గురుక్రీత్ సింగ్ 6, పార్థివ్ పటేల్ 8, హెన్రీచ్ క్లాసీన్ 6, పవన్ నేగి 4 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. మొదటి 9 బంతుల్లో 35 రాబట్టిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు... చివరి 21 బంతుల్లో కేవలం 27 పరుగులు మాత్రమే రాబట్టి 7 వికెట్లు కోల్పోవడం విశేషం. శ్రేయాస్ గోపాల్‌కు 3, ఒసానే థామస్‌కు రెండు వికెట్లు దక్కగా...రియాన్ పరాగ్, ఉనాద్కడ్ చెరో వికెట్ తీశారు.


First published: May 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...