RCB vs KXIP: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్... బెంగళూరు బ్యాటింగ్...

డబుల్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత పంజాబ్‌పైనే తొలి విక్టరీ సాధించిన విరాట్ టీమ్... ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న పంజాబ్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 24, 2019, 7:43 PM IST
RCB vs KXIP: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్... బెంగళూరు బ్యాటింగ్...
డబుల్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత పంజాబ్‌పైనే తొలి విక్టరీ సాధించిన విరాట్ టీమ్... ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న పంజాబ్...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 24, 2019, 7:43 PM IST
IPL 2019 Live Score, RCB vs KXIP Match at Chinnaswamy Stadium: కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు కెప్టెన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో వరుసగా డబుల్ హ్యాట్రిక్ ఓటములు ఎదుర్కొన్న తర్వాత మొట్టమొదటి విజయం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పైనే సాధించింది విరాట్ టీమ్. ప్రస్తుతం 3 విజయాలతో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఈ మ్యాచ్ కోల్పోతే ఫ్లేఆఫ్ ఆశలు దాదాపు కోల్పోయినట్టే. అందుకే ఈ మ్యాచ్ బెంగళూరుకు ఎంతో కీలకం కానుంది. మరోవైపు వరుస పరాజయాలతో సతమతమవుతోంది పంజాబ్ కింగ్స్ జట్టు. టాప్ 4లో నుంచి కిందకి పడిపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్‌లో గేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 64 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గేల్ మరోసారి రెచ్చిపోతే మాత్రం బెంగళూరు బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. మొయిన్ ఆలీ ఈ మ్యాచ్ తర్వాత వన్డే వరల్డ్‌కప్ సన్నాహాల కోసం స్వదేశానికి వెళ్లబోతున్నాడు. అతనికీ సీజన్‌లో ఇదే ఆఖరి మ్యాచ్ కానుంది. స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్ వెన్నునొప్పితో బాధపడుతుండడంతో అతని స్థానంలో టీమ్ సౌథీకి అవకాశం కల్పించాడు విరాట్ కోహ్లీ.


పంజాబ్ జట్టు: క్రిస్ గేల్, రాహుల్, మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్, మన్‌దీప్ సింగ్, అశ్విన్, హర్దూస్ విల్‌జీన్, షమీ, మురుగన్ అశ్విన్, అంకిత్ రాజ్‌పుత్



బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు: పార్థివ్ పటేల్, మొయిన్ ఆలీ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, ఉమేశ్ యాదవ్, మర్కస్ స్టోయినిస్, అక్ష్‌దీప్ నాథ్, వాషింగ్టన్ సుందర్, టీమ్ సౌథీ, నవ్‌దీప్ శైనీ, ఉమేశ్ యాదవ్, చాహాల్

First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...