RCB vs KXIP: బెంగళూరు భారీ స్కోరు... అదరగొట్టిన డివిల్లియర్స్, స్టోయినిస్....

IPL 2019 Live Score, RCB vs KXIP Match at Chinnaswamy Stadium: హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఏబీ డివిల్లియర్స్... స్టోయినిస్‌తో అద్భుత భాగస్వామ్యం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 24, 2019, 9:48 PM IST
RCB vs KXIP: బెంగళూరు భారీ స్కోరు... అదరగొట్టిన డివిల్లియర్స్, స్టోయినిస్....
IPL 2019 Live Score, RCB vs KXIP Match at Chinnaswamy Stadium: హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఏబీ డివిల్లియర్స్... స్టోయినిస్‌తో అద్భుత భాగస్వామ్యం...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 24, 2019, 9:48 PM IST
IPL 2019 Live Score, RCB vs KXIP Match at Chinnaswamy Stadium: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు...నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆరంభంలో విరాట్ కోహ్లీ, పార్థివ్ పటేల్ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో 3 ఓవర్లలోనే 35 పరుగులు రాబట్టింది. అయితే నాలుగో ఓవర్ మొదటి బంతికే విరాట్‌ కోహ్లీ(13 పరుగులు)ని అవుట్ చేసిన షమీ... ఆర్‌సీబీకి మొదటి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత 24 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన పార్థివ్ పటేల్‌ను మురుగన్ అశ్విన్ అవుట్ చేయగా... మొయిన్ ఆలీ 4 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అక్ష్‌దీప్ సింగ్ కూడా 3 పరుగులకే పెవిలియన్ చేరడంతో 81 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది బెంగళూరు. ఆ తర్వాత ఏబీ డివిల్లియర్స్, మార్కస్ స్టోయినిస్ కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు.

షమీ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా 3 సిక్సర్లు సాధించి 21 పరుగులు రాబట్టాడు డివిల్లియర్స్. ఆ తర్వాత విల్‌జీన్ వేసిన ఆఖరి ఓవర్లో డివిల్లియర్స్ ఓ సిక్స్, స్టోయినిస్ వరుసగా ఫోర్, సిక్స్, ఫోర్,సిక్స్‌తో బాదడంతో బెంగళూరు 200 పరుగుల మైలురాయిని దాటింది. 44 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 పరుగులు చేసిన డివిల్లియర్స్, 34 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసిన మార్కస్ స్టోయినిస్... ఐదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 66 బంతుల్లో 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.


First published: April 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...