RCB vs KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా... బెంగళూరు బ్యాటింగ్...

RCB vs KKR: హెట్మయర్ స్థానంలో టీమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్ స్థానంలో పవన్ నేగికి అవకాశం కల్పించిన విరాట్ కోహ్లీ...

Chinthakindhi.Ramu
Updated: April 5, 2019, 7:37 PM IST
RCB vs KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా... బెంగళూరు బ్యాటింగ్...
RCB vs KKR: హెట్మయర్ స్థానంలో టీమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్ స్థానంలో పవన్ నేగికి అవకాశం కల్పించిన విరాట్ కోహ్లీ...
  • Share this:
IPL 2019 Live Score, RCB vs KKR in Bangalore: బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కత్తా జట్టు కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వరుసగా నాలుగు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన బెంగళూరు జట్టుకు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా కీలకం. సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండడం విరాట్ కోహ్లీ టీమ్‌లో పాజిటివ్ ఎనర్జీని నింపే అంశం. మరోవైపు మూడు మ్యాచుల్లో రెండు గెలిచిన కోల్‌కత్తా... చివరి మ్యాచ్‌లోనూ సూపర్‌ఓవర్ చివరి బంతి దాకా పోరాడి ఓడింది. సంజూ శాంసన్‌తో పాటు ఆండ్రే రస్సెల్ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా రస్సెల్‌ను ఎంత త్వరగా అవుట్ చేస్తారనేదానిపైనే కోల్‌కత్తా స్కోర్ ఆధారపడి ఉంది. మరోవైపు వరుసగా విఫలమవుతూ వస్తున్న కోహ్లీ టీమ్... ఈ మ్యాచ్‌లో గెలిచి, విమర్శకులకు గట్టి సమాధానం చెప్పాలని భావిస్తోంది. స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిల్లియర్స్, మొయిన్ ఆలీ ఫామ్‌లోకి వస్తే మాత్రం కోల్‌కత్తాపై విజయం సాధించడం అంత కష్టమేమీ కాదు. ఆర్‌సీబీ బౌలర్ యజ్వేంద్ర చాహాల్ అద్భుతంగా రాణిస్తుండడం ఆ జట్టుకు అదనపు ఎనర్జీని ఇచ్చే అంశం. అయితే ఆర్‌సీబీ పర్ఫామెన్స్‌తో బాగా ఢీలాపడిన బెంగళూరు ఫ్యాన్స్, మ్యాచ్ చూడడానికి పెద్ద సంఖ్యలో స్టేడియానికి రాలేదు. ఈ పరిస్థితి మారాలంటే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలవాల్సిందే!

బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు: పార్థివ్ పటేల్, మొయిన్ ఆలీ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, టీమ్ సౌథీ, మర్కస్ స్టోయినిస్, అక్ష్‌దీప్ నాథ్, పవన్ నేగి, నవదీప్ శైనీ, మహ్మద్ సిరాజ్, చాహాల్

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు: సునీల్ నరైన్, క్రిస్ లీన్, రాబిన్ ఊతప్ప, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, శుబ్‌మన్ గిల్, ఆండ్రే రస్సెల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, లోకీ ఫర్గూసన్, ప్రసిద్ధ్ కృష్ణ

POINTS TABLE:


SCHEDULE TIME TABLE:
ORANGE CAP:


PURPLE CAP:


RESULTS TABLE:


RCB vs KKR: తొలి విజయం కోసం విరాట్ సేన తహతహ... కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో ఢీ...




IPL 2019: రాయల్ ఛాలెంజర్స్‌ ఈ గతికి కారణమేంటి... విరాట్ సేనకు ఏమైంది...
First published: April 5, 2019, 7:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading