RCB vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై... బెంగళూరు బ్యాటింగ్...

IPL 2019 Live Score, RCB vs CSK in Bangalore: ఈ మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 21, 2019, 7:37 PM IST
RCB vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై... బెంగళూరు బ్యాటింగ్...
IPL 2019 Live Score, RCB vs CSK in Bangalore: ఈ మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు...
  • Share this:
IPL 2019 Live Score, RCB vs CSK in Bangalore: బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కీ, చెన్నై సూపర్‌కింగ్స్‌కీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్లేఆఫ్ పోరులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం బెంగళూరుకు అత్యంత ఆవశ్యకం. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి, ఫ్లేఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేయాలని చెన్నై జట్టు ఆశపడుతోంది. దాంతో భారత మాజీ సారథి ధోనీ, ప్రస్తుత సారథి కోహ్లీ జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరుజట్లుకు కీలకంగా మారింది. ఐపీఎల్ 12వ సీజన్ ప్రారంభానికి ముందు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. గత సీజన్‌లో విఫలమైన కోహ్లీ సేన... ఈ సారి కప్ కొడుతుందని ఆశించారు. అయితే మొదటి మ్యాచ్‌లోనే వారి ఆశలపై నీళ్లు చల్లింది చెన్నై సూపర్ కింగ్స్. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన చెన్నై, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టును ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించింది. హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహీర్ వంటి సీనియర్ బౌలర్ల ధాటికి బెంగళూరు బ్యాట్స్‌మెన్ అల్లాడిపోయారు. మొత్తంగా 70 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని కసిగా ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.

బెంగళూరు జట్టు: పార్థివ్ పటేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, మొయిన్ ఆలీ, మార్కస్ స్టోయినిస్, అక్షదీప్ నాథ్, పవన్ నేగీ, చాహాల్, డేల్ స్టేయిన్, నవ్‌దీప్ శైనీ, ఉమేశ్ యాదవ్

చెన్నై జట్టు: షేన్ వాట్సన్, డుప్లిసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, ధోనీ, రవీంద్ర జడేజా, బ్రావో, దీపక్ చాహార్, శార్దూల్ ఠాగూర్, ఇమ్రాన్ తాహీర్

First published: April 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు