MI vs SRH: ఆఖరి బంతికి మనీశ్ పాండే సిక్సర్... ఐపీఎల్‌లో మరో ‘సూపర్ ఓవర్‌’ మ్యాచ్...

71 పరుగులు చేసిన మనీశ్ పాండే... హర్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, బుమ్రాలకు రెండేసి వికెట్లు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 2, 2019, 11:54 PM IST
MI vs SRH: ఆఖరి బంతికి మనీశ్ పాండే సిక్సర్... ఐపీఎల్‌లో మరో ‘సూపర్ ఓవర్‌’ మ్యాచ్...
71 పరుగులు చేసిన మనీశ్ పాండే... హర్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, బుమ్రాలకు రెండేసి వికెట్లు...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 2, 2019, 11:54 PM IST
IPL 2019 Live Score, MI vs SRH Match in Mumbai: 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు...20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 162 పరుగులు చేయగలిగింది. చివరి బంతికి 7 పరుగులు కావల్సిన దశలో భారీ సిక్సర్ సాధించిన మనీశ్ పాండే... మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లాడు. దాంతో మ్యాచ్ టై అయ్యి, సూపర్ ఓవర్ దాకా వెళ్లింది. చాలారోజుల తర్వాత జట్టులో స్థానం దక్కించుకున్న సాహా, గుప్టిల్... మొదటి ఓవర్ నుంచే దాటిగా బ్యాటింగ్ చేశారు. అయితే 15 బంతుల్లో 5 ఫోర్లతో 25 పరుగులు చేసిన సాహాను అవుట్ చేసిన బుమ్రా... తర్వాత ఓవర్‌లో 15 పరుగులు చేసిన గుప్టిల్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కేన్ విలియంసన్ 3, విజయ్ శంకర్ 12, అభిషేక్ శర్మ 2 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. 105 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు... చిత్తుగా ఓడిపోతుందని అనిపించింది. అయితే అద్భుతంగా బ్యాటింగ్ చేసిన మనీశ్ పాండే... మహ్మద్ నబీతో కలిసి చివరి ఓవర్ దాకా పోరాడాడు. హర్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్‌లో హైదరాబాద్ విజయానికి 17 పరుగులు కావల్సి ఉండగా... మొదటి బంతికి నబీ సింగిల్ తీశాడు. రెండో బంతికి మనీశ్ పాండే భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి సింగిల్ మాత్రమే వచ్చింది. మూడో బంతికి సిక్సర్ కొట్టిన నబీ... మూడు బంతుల్లో 9 పరుగులు కావల్సిన స్థితికి తీసుకొచ్చాడు. అయితే ఆ తర్వాతి బంతికి నబీ అవుట్ కావడంతో ఉత్కంఠ రేగింది. ఐదో బంతికి పాండే 2 పరుగులు రాబట్టాడు. చివరి బంతికి సిక్స్ సాధిస్తే... మ్యాచ్ టై అవుతుంది. చివరి బంతిని సిక్స్‌గా మలిచిన మనీశ్ పాండే... మ్యాచ్‌ను సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్లాడు.
20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో మహ్మద్ నబీ 31 పరుగులు చేసి అవుట్ కాగా... 47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు మనీశ్ పాండే.

అంతకుముందు టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించడంతో 5.2 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే చేసింది ముంబై. ఈ దశలో 18 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు డి కాక్. 17 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 23 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇవిన్ లూయిస్ 1 పరుగుకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్స్‌తో 18 పరుగులు చేసిన హర్ధిక్ పాండ్యా... భువనేశ్వర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత డి కాక్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ సీజన్‌లో డి కాక్‌కు ఇది నాలుగో అర్ధశతకం కావడం విశేషం. పోలార్డ్ 10 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ కాగా... కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు... ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సఫలమయ్యారు.

ఖలీల్ అహ్మద్‌కు మూడు వికెట్లు దక్కగా... భువనేశ్వర్ కుమార్, నబీ చెరో వికెట్ తీశారు. 58 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేసిన డికాక్, 3 బంతుల్లో 9 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా నాటౌట్‌గా నిలిచారు.

First published: May 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...