IPL 2019 Live Score, MI vs SRH Match in Mumbai: సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ స్వదేశానికి వెళ్లిపోవడంతో అతను లేని ఆ జట్టు ఏ మేరకు రాణిస్తుందనే ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి ఫ్లేఆఫ్స్‌లో చోటు కన్ఫార్మ్ చేసుకోవాలని భావిస్తోంది ముంబై ఇండియన్స్. ప్రస్తుతం 12 మ్యాచుల్లో 7 మ్యాచులు గెలిచిన ముంబై... 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 12 మ్యాచుల్లో 6 మ్యాచుల్లో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ముంబై ఈ మ్యాచ్ గెలిస్తే ఫ్లేఆఫ్స్‌లో చోటు ఖరారు చేసుకుంటే... హైదరాబాద్‌కు విజయం దక్కితే మూడో స్థానానికి ఎగబాకుతుంది. ముంబై కంటే హైదరాబాద్ రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో ఫ్లేఆఫ్స్ అవకాశాలు బలపడతాయి. అయితే 692 పరుగులతో సీజన్లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్ లేకపోవడం హైదరాబాద్ జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అతనిస్థానంలో మార్టిన్ గుప్టిల్‌కు జట్టులో అవకాశం కల్పించింది సన్‌రైజర్స్ హైదరాబాద్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.