Home /News /sports /

IPL 2019 LIVE SCORE MI VS SRH MATCH IN MUMBAI MUMBAI END ON 1625 CR

MI vs SRH: మంచి స్కోరు సాధించిన ముంబై... డికాక్ హాఫ్ సెంచరీ... ఖలీల్ అహ్మద్‌కు మూడు వికెట్లు...

ఖలీల్ అహ్మద్‌కు మూడు వికెట్లు... 69 పరుగులు చేసిన డికాక్...

ఖలీల్ అహ్మద్‌కు మూడు వికెట్లు... 69 పరుగులు చేసిన డికాక్...

ఖలీల్ అహ్మద్‌కు మూడు వికెట్లు... 69 పరుగులు చేసిన డికాక్...

IPL 2019 Live Score, MI vs SRH Match in Mumbai: టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఓపెనర్లు ఇద్దరూ నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించడంతో 5.2 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే చేసింది ముంబై. ఈ దశలో 18 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు డి కాక్. 17 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 23 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇవిన్ లూయిస్ 1 పరుగుకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్స్‌తో 18 పరుగులు చేసిన హర్ధిక్ పాండ్యా... భువనేశ్వర్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత డి కాక్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ సీజన్‌లో డి కాక్‌కు ఇది నాలుగో అర్ధశతకం కావడం విశేషం. పోలార్డ్ 10 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ కాగా... కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు... ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సఫలమయ్యారు.

ఖలీల్ అహ్మద్‌కు మూడు వికెట్లు దక్కగా... భువనేశ్వర్ కుమార్, నబీ చెరో వికెట్ తీశారు. 58 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేసిన డికాక్, 3 బంతుల్లో 9 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా నాటౌట్‌గా నిలిచారు.
First published:

Tags: Cricket, IPL, IPL 2019, Mumbai Indians, Sun risers hyderabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు