MI vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్... ముంబై బ్యాటింగ్...

IPL 2019 Live Score, MI vs RR Match at Wankhede: గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 13, 2019, 3:49 PM IST
MI vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్... ముంబై బ్యాటింగ్...
IPL 2019 Live Score, MI vs RR Match at Wankhede: గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ...
  • Share this:
IPL 2019 Live Score, MI vs RR Match at Wankhede: ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు కెప్టెన్ అజింకా రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై జట్టు బ్యాటింగ్ చేయనుంది. గత మ్యాచ్‌లో గాయం కారణంగా జట్టుకు దూరమైన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, ఈ మ్యాచ్‌లో బరిలో దిగుతున్నాడు. ఇప్పటిదాకా సింగిల్ విజయంతో టేబుల్‌లో కింది నుంచి రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్‌లో రాణిస్తున్నా, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఆ జట్టు చేస్తున్న తప్పిదాలు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో లాస్ట్ మ్యాచ్ దాకా పోరాడినా ఫలితం దక్కలేదు. ఇప్పటికే 6 మ్యాచుల్లో 5 మ్యాచులు ఓడిన రాజస్థాన్... టాప్ 4లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఇకపై ఆడబోయే మ్యాచులన్నీ కీలకం కానున్నాయి. రాజస్థాన్‌తో పోలిస్తే ముంబై జట్టు పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. గత మ్యాచ్‌లో అద్భుతంగా ఫామ్‌లోకి వచ్చిన పోలార్డ్, అద్భుతంగా పోరాడి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయాన్ని అందించాడు.

రాజస్థాన్ జట్టు: అజింకా రహానే, బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి, జోఫ్రా ఆర్క్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనద్కడ్, దవల్ కులకర్ణి, లియామ్ లింగింగ్‌స్టోన్, కృష్ణప్ప గౌతమ్

ముంబై జట్టు: డి కాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పోలార్డ్, కృనాల్ పాండ్యా, హర్ధిక్ పాండ్యా, రాహుల్ చాహార్, అల్జరీ జోసఫ్, బుమ్రా, జాసన్ బెహ్రాన్‌డాఫ్


First published: April 13, 2019, 3:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading