MI vs RR: ముంబైకి షాక్ ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్... సీజన్‌లో రెండో విజయం...

IPL 2019 Live Score, MI vs RR Match at Wankhede: 89 పరుగులు చేసిన జోస్ బట్లర్, రహానె 37 పరుగులు... చివరి ఓవర్ దాకా నడిచిన హైడ్రామా...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 13, 2019, 8:08 PM IST
MI vs RR: ముంబైకి షాక్ ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్... సీజన్‌లో రెండో విజయం...
IPL 2019 Live Score, MI vs RR Match at Wankhede: 89 పరుగులు చేసిన జోస్ బట్లర్, రహానె 37 పరుగులు... చివరి ఓవర్ దాకా నడిచిన హైడ్రామా...
  • Share this:
IPL 2019 Live Score, MI vs RR Match at Wankhede: ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో రెండో విజయం కోసం ఎదురుచూస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఆశలు ఎట్టకేలకు ఫలించాయి. 188 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో అధిగమించింది రాజస్థాన్ రాయల్స్. ఒకానొక దశలో రాజస్థాన్ రాయల్స్ ఈజీ విక్టరీ సాధిస్తుందని అనుకున్నా, చివర్లో వరుస వికెట్లు కోల్పోవడంతో చివరి ఓవర్ దాకా హైడ్రామా నడిచింది. మొదటి ఓవర్‌లోనే కెప్టెన్ అజింకా రహానేను అవుట్‌గా ప్రకటించారు అంపైర్లు. అయితే రివ్యూకి వెళ్లి బతికిపోయిన రహానె... బట్లర్‌తో కలిసి దూకుడుగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరు కలిసి 6.2 ఓవర్లలోనే 60 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు. అయితే ఆ తర్వాత 21 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో 37 పరుగులు చేసిన తర్వాత కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రహానె. రహానె అవుటైన తర్వాత కూడా జోరు కొనసాగించిన బట్లర్... 29 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. బట్లర్ బాదుడు కారణంగా 10 ఓవర్లలోనే 100 పరుగుల మైలురాయిని అందుకుంది రాజస్థాన్ జట్టు. ఆ తర్వాత హైదరాబాద్‌పై ఆరు వికెట్లు తీసిన జోసెఫ్ అల్జెరీ ఓవర్‌లో ఓ సిక్స్, నాలుగు ఫోర్లు, సిక్స్‌తో ఏకంగా 28 పరుగులు రాబట్టారు బట్లర్. ఈ ఓవర్ దెబ్బకు విజయానికి 42 బంతుల్లో 42 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది రాయల్స్. అయితే ఆ తర్వాతి ఓవర్‌ మొదటి బంతినే గాల్లోకి లేపి, సంజూ శాంసన్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోగా... తర్వాత బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి బట్లర్ అవుట్ అయ్యాడు. 43 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు బట్లర్. బట్లర్ అవుటైన తర్వాత కావల్సిన రన్‌రేట్ కేవలం 6 మాత్రమే ఉండడంతో నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్. అయితే విజయానికి 18 పరుగులు కావల్సిన దశలో సంజూ శాంసన్ అవుట్ అయ్యాడు. 26 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 31 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు శాంసన్. ఆ వెంటనే రాహుల్ త్రిపాఠి, లివింగ్‌స్టన్ చెరో పరుగు చేసి పెవిలియన్ చేరడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది రాజస్థాన్. స్టీవ్ స్మిత్ కూడా 12 పరుగులకే పెవిలియన్ చేరడంతో నాలుగు పరుగుల తేడాలో నాలుగు వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. కీలక సమయంలో శ్రేయాస్ గోపాల్ ఫోర్ కొట్టడంతో చివరి ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు పరుగులు కావల్సిన స్థితికి చేరుకుంది రాజస్థాన్. హర్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్ మొదటి బంతికి శ్రేయాస్ గోపాల్ 2 పరుగులు తీయగా, రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతికి ఫోర్ కొట్టి, జట్టుకు విజయాన్ని అందించాడు శ్రేయాస్ గోపాల్.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించి శుభారంభం అందించారు. 32 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఆర్క్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 52 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేసిన డి కాక్... ఆర్క్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులు, గత మ్యాచ్‌లో అదరగొట్టిన పొలార్డ్ కేవలం 6 పరుగులు, ఇషాన్ కిషన్ 5 పరుగులు చేసి అవుట్ కాగా... హార్ధిక్ పాండ్యా చివర్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 28 పరుగులు చేయడంతో ముంబై భారీ స్కోరు చేయగలిగింది. జోఫ్రా ఆర్క్‌కు మూడు వికెట్లు దక్కగా ధవల్ కుల్‌కర్ణి, జయదేవ్ ఉనద్కడ్‌లకు చెరో వికెట్ దక్కాయి.

SCHEDULE TIME TABLE:


RESULTS TABLE:
First published: April 13, 2019, 7:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading