MI vs RR: ముంబై భారీ స్కోరు... ఫామ్‌లోకి వచ్చిన రోహిత్... డికాక్ సూపర్బ్ ఇన్నింగ్స్...

IPL 2019 Live Score, MI vs RR Match at Wankhede: డి కాక్ 81 పరుగులు... రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ మిస్... ఆర్క్‌కు మూడు వికెట్లు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 13, 2019, 5:50 PM IST
MI vs RR: ముంబై భారీ స్కోరు... ఫామ్‌లోకి వచ్చిన రోహిత్... డికాక్ సూపర్బ్ ఇన్నింగ్స్...
డి కాక్
  • Share this:
IPL 2019 Live Score, MI vs RR Match at Wankhede: రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగుల భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టుకు శుభారంభం అందించారు ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ అవుట్ అయ్యాడు. 32 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఆర్క్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత డి కాక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు డికాక్. అతనికి ఇది ఐపీఎల్ కెరీర్‌లో ఎనిమిదో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఆ తర్వాత కొద్దిసేపటికే సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గత మ్యాచ్‌లో అదరగొట్టిన పొలార్డ్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి, అవుట్ అయ్యాడు. 52 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులు చేసిన డి కాక్... ఆర్క్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. చివరి ఓవర్‌లో ఇషాన్ కిషన్ 5 పరుగులు చేసి అవుట్ కాగా... హార్ధిక్ పాండ్యా చివర్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 28 పరుగులు చేయడంతో ముంబై భారీ స్కోరు చేయగలిగింది. జోఫ్రా ఆర్క్‌కు మూడు వికెట్లు దక్కగా ధవల్ కుల్‌కర్ణి, జయదేవ్ ఉనద్కడ్‌లకు చెరో వికెట్ దక్కాయి.


SCHEDULE TIME TABLE:




RESULTS TABLE:
Published by: Ramu Chinthakindhi
First published: April 13, 2019, 5:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading