MI vs KXIP: రాహుల్ సెంచరీ, గేల్ సునామీ... పంజాబ్ భారీ స్కోరు... ముంబై టార్గెట్ 198...

IPL 2019 Live Cricket Score, MI vs KXIP Match at Wankhede: ఐపీఎల్ కెరీర్‌లో మొదటి సెంచరీ బాదిన కెఎల్ రాహుల్... హాఫ్ సెంచరీతో అదరగొట్టిన క్రిస్‌గేల్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 10, 2019, 10:04 PM IST
MI vs KXIP: రాహుల్ సెంచరీ, గేల్ సునామీ... పంజాబ్ భారీ స్కోరు... ముంబై టార్గెట్ 198...
కెఎల్ రాహుల్, క్రిస్ గేల్
  • Share this:
IPL 2019 Live Cricket Score, MI vs KXIP Match at Wankhede: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 197 పరుగుల భారీ స్కోరు చేసింది... ఆరంభంలో నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఓపెనర్లు. ఆ తర్వాత ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఇద్దరూ బౌండరీలతో విరుచుకుపడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. క్రిస్ గేల్, రాహుల్ ధాటికి 11 ఓవర్లలోనే 100 మార్కుని అధిగమించింది పంజాబ్ జట్టు. 36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 63 పరుగులు చేసిన తర్వాత క్రిస్‌గేల్... భారీషాట్‌కు ప్రయత్నించి కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రాహుల్, క్రిస్‌గేల్ ఇద్దరూ కలిసి 12.5 ఓవర్లలో 116 పరుగులు జోడించారు. ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు తరుపున ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. అయితే గేల్ అవుటైన తర్వాత డేవిడ్ మిల్లర్ 7 పరుగులు, కరణ్ నాయర్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వస్తూనే రెండు ఫోర్లు కొట్టిన సామ్ కర్రాన్ కూడా 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ రాహుల్ జోరు కొనసాగించాడు.




హర్ధిక్ పాండ్యా వేసిన 19వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 23 పరుగులు రాబట్టిన కెఎల్ రాహుల్, చివరి ఓవర్‌లో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 64 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ పూర్తిచేసుకున్నాడు రాహుల్. అతనితో పాటు మన్‌దీప్ 7 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హర్ధిక్ పాండ్యాకు రెండు వికెట్లు దక్కగా... బుమ్రా, బెహ్రడాఫ్‌లకు చెరో వికెట్ దక్కాయి.


POINTS TABLE:
SCHEDULE TIME TABLE:


ORANGE CAP:


PURPLE CAP:


RESULTS TABLE:
Published by: Ramu Chinthakindhi
First published: April 10, 2019, 10:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading