పంజాబ్‌కు పొలార్డ్ పంచ్..ముంబై థ్రిల్లింగ్ విక్టరీ..రాహుల్ సెంచరీ వృథా

గురువారం రాత్రి 8 గంటలకు జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడున్నాయి.

news18-telugu
Updated: April 11, 2019, 12:29 AM IST
పంజాబ్‌కు పొలార్డ్ పంచ్..ముంబై థ్రిల్లింగ్ విక్టరీ..రాహుల్ సెంచరీ వృథా
పొలార్డ్
  • Share this:
IPL 2019 Cricket Score, MI vs KXIP Match at Wankhede: ఐపీఎల్‌ 2019లో ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విక్టరీ సాధించింది. వాంఖడే స్టేడియంలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో అద్భుత విజయం నమోదుచేసింది. ట్రినిడాడ్ స్టార్ పొలార్డ్ సిక్సర్ల సునామీ ధాటికి పంజాబ్ జట్టు ఓడిపోయింది. పొలార్డ్ ఊచకోతకు కేఎల్ రాహుల్ సెంచరీ చిన్నబోయింది. ఐతే విజయానికి 4 పరుగుల దూరంలో పొలార్డ్ ఔట్ అవడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. చివరి బంతికి జోసెఫ్ రెండు పరుగులు చేసి జట్టును విజయ తీరానికి చేర్చాడు. ముంబై జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఐతే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ లేనప్పటికీ ఆ బాధ్యతలను చక్కగా నిర్వర్తించాడు పొలార్డ్.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. కొత్తగా వచ్చిన ఓపెనర్ సిద్దార్థ్ లాడ్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ సమర్పించుకున్నాడు. లాడ్ 15 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా అలాగే అవుట్ అయ్యారు. లక్ష్యం ఎక్కువగా ఉండడంతో దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి వికెట్ల ముందు దొరికిపోయారు. సూర్యకుమార్ 21, హార్ధిక్ పాండ్యా 19 పరుగులు చేశారు. అనవసర రన్‌కు ప్రయత్నించి ఇషాన్ కిషన్ (7) అవుటయ్యాడు. ఐతే ఓ వైపు వికెట్లు పడుతున్నా పొలార్డ్ మాత్రం హిట్టింగ్‌తో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 31 బంతుల్లోనే 83 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 10 సిక్సర్లతో పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు పొలార్డ్.

పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా..కర్రాన్, అశ్విన్, అంకిత్ చెరో వికెట్ తీశారు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. ఆరంభంలో నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఓపెనర్లు. ఆ తర్వాత ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఇద్దరూ బౌండరీలతో విరుచుకుపడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ 64 బంతుల్లో సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. క్రిస్‌గేల్ 36 బంతుల్లోనే 63 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. రాహుల్, క్రిస్‌గేల్ ఇద్దరూ కలిసి 12.5 ఓవర్లలో 116 పరుగులు జోడించారు. ఈ సీజన్‌లో పంజాబ్ జట్టు తరుపున ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. గేల్ అవుటైన తర్వాత డేవిడ్ మిల్లర్ 7 పరుగులు, కరణ్ నాయర్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

ముంబై బౌలర్లలో హార్ధిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా బెరెన్‌డాఫ్, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు. ఇప్పటి వరకు పంజాబ్ 7 మ్యాచ్‌లు ఆడగా..4 గెలిచింది. ముంబై 6 మ్యాచ్‌లు ఆడగా..నాలుగింట విజయం సాధించింది. ఇక గురువారం రాత్రి 8 గంటలకు జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడున్నాయి.

POINTS TABLE:
SCHEDULE TIME TABLE:


ORANGE CAP:


PURPLE CAP:


RESULTS TABLE:
Published by: Shiva Kumar Addula
First published: April 11, 2019, 12:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading