KXIP vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు... పంజాబ్ బ్యాటింగ్...

KXIP vs RCB Match in Mohali: మొదటి విజయం కోసం ఎదురుచూస్తున్న విరాట్ టీమ్... ఉమేశ్ యాదవ్‌కు జట్టులో స్థానం కల్పించిన బెంగళూరు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 13, 2019, 8:04 PM IST
KXIP vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు... పంజాబ్ బ్యాటింగ్...
KXIP vs RCB Match in Mohali: మొదటి విజయం కోసం ఎదురుచూస్తున్న విరాట్ టీమ్... ఉమేశ్ యాదవ్‌కు జట్టులో స్థానం కల్పించిన బెంగళూరు...
  • Share this:
KXIP vs RCB Match in Mohali: కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటిదాకా ఒక్క విజయం కూడా లేకుండా డబుల్ హ్యాట్రిక్ ఓటములతో టేబుల్‌లో కింది స్థానంలో ఉన్న బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ బ్యాటింగ్‌లో రాణిస్తున్నా, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఆ జట్టు చేస్తున్న తప్పిదాలు భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నాయి. ఈ మ్యాచ్ బెంగళూరుకు చాలా కీలకం కానుంది. మరో వైపు 7 మ్యాచుల్లో 4 విజయాలు సాధించిన పంజాబ్ జట్టు కూడా విజయంపై ఆశలు భారీగానే పెట్టుకుంది. క్రిస్‌గేల్, రాహుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉండడం పంజాబ్‌కు కలిసొచ్చే అంశం.

పంజాబ్ జట్టు: క్రిస్ గేల్, రాహుల్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, నికోలస్ పూరన్, మన్‌దీప్ సింగ్, సామ్ కుర్రాన్, అశ్విన్, ఆండ్రూ టై, షమీ, మురుగన్ అశ్విన్

బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు: పార్థివ్ పటేల్, మొయిన్ ఆలీ, విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, ఉమేశ్ యాదవ్, మర్కస్ స్టోయినిస్, అక్ష్‌దీప్ నాథ్, పవన్ నేగి, నవదీప్ శైనీ, మహ్మద్ సిరాజ్, చాహాల్
Published by: Ramu Chinthakindhi
First published: April 13, 2019, 7:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading