KXIP vs KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్... పంజాబ్ బ్యాటింగ్...

ఫ్లేఆఫ్స్ రేసులో ఉన్న ఇరుజట్ల మధ్య కీలక పోరు... 12 మ్యాచుల్లో ఐదేసీ విజయాలతో ఉన్న రెండు జట్లు... గత మ్యాచ్‌లో భారీ స్కోర్లు చేసిన కోల్‌కతా, పంజాబ్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 3, 2019, 7:50 PM IST
KXIP vs KKR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్... పంజాబ్ బ్యాటింగ్...
ఫ్లేఆఫ్స్ రేసులో ఉన్న ఇరుజట్ల మధ్య కీలక పోరు... 12 మ్యాచుల్లో ఐదేసీ విజయాలతో ఉన్న రెండు జట్లు... గత మ్యాచ్‌లో భారీ స్కోర్లు చేసిన కోల్‌కతా, పంజాబ్...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 3, 2019, 7:50 PM IST
IPL 2019 Live Score, KXIP vs KKR Match in Mohali: కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ బ్యాటింగ్ చేయనుంది. ఇరుజట్లు ఫ్లేఆఫ్ రేసులో ఉన్నందున ఈ మ్యాచ్ ఇద్దరికీ కీలకం కానుంది. ఇరుజట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో 218 పరుగుల కోల్‌కతా నైట్‌రైడర్స్ భారీ స్కోరు చేసింది. నితీశ్ రాణా 34 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 63 పరుగులు, రాబిన్ ఊతప్ప 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేయగా ఆండ్రే రస్సెల్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. భారీ లక్ష్యచేధనలో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేయగలిగింది. డేవిడ్ మిల్లర్ 59 పరుగులతో, మన్‌దీప్ 33 పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్‌లో కూడా ఇరు జట్ల నుంచి ఆ స్థాయి ప్రదర్శన అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్.

పంజాబ్ జట్టు: రాహుల్, క్రిస్‌గేల్, మయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్, అశ్విన్, సామ్ కుర్రాన్, సిమ్రాన్ సింగ్, మురుగన్ అశ్విన్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, ఆండ్రూ టై

కోల్‌కత్తా జట్టు: క్రిస్ లీన్, నితీశ్ రాణా, సునీల్‌ నరైన్, రాబిన్ ఊతప్ప, దినేశ్ కార్తీక్, శుబ్‌మన్ గిల్, ఆండ్రే రస్సెల్, రింకూ సింగ్, పియూష్ చావ్లా,సందీప్ వారియర్, హ్యారీ గుర్నే

First published: May 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...