KXIP vs KKR: సామ్ కుర్రాన్ హాఫ్ సెంచరీ... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ స్కోరు...

IPL 2019 Live Score, KXIP vs KKR Match in Mohali: 48 పరుగులు చేసిన నికోలస్ పూరన్... సామ్ కుర్రాన్ హాఫ్ సెంచరీ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 3, 2019, 10:36 PM IST
KXIP vs KKR: సామ్ కుర్రాన్ హాఫ్ సెంచరీ... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భారీ స్కోరు...
IPL 2019 Live Score, KXIP vs KKR Match in Mohali: 48 పరుగులు చేసిన నికోలస్ పూరన్... సామ్ కుర్రాన్ హాఫ్ సెంచరీ...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 3, 2019, 10:36 PM IST
IPL 2019 Live Score, KXIP vs KKR Match in Mohali: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 183 పరుగుల భారీ స్కోరు చేసింది. కొత్త కుర్రాడు సందీప్ వారియర్ ఓపెనర్లను స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేర్చి, పంజాబ్‌కు షాక్ ఇచ్చాడు. లోకేశ్ రాహుల్ 2 పరుగులకే పెవిలియన్ చేరగా...క్రిస్‌గేల్ 14 పరుగులు చేసి సందీప్ వారియర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో నికోలస్‌ పూరన్, మయాంక్ అగర్వాల్ కలిసి మూడో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 పరుగులు చేసిన నికోలస్ పూరన్... నితీశ్ రాణా బౌలింగ్‌లో సందీప్ వారియర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాాత కొద్దిసేపటికే 36 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ కూడా అవుట్ కావడంతో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. మన్‌దీప్ సింగ్ 25 పరుగులు చేసి గుర్నే బౌలింగ్‌లో ఊతప్పకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన, రస్సెల్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత సామ్ కుర్రాన్ చెలరేగిపోయాడు.

24 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు సామ్ కుర్రాన్. గుర్నే వేసిన చివరి ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన సామ్ కుర్రాన్ ఏకంగా 22 పరుగులు రాబట్టాడు. సందీప్ వారియర్‌కు రెండు వికెట్లు దక్కగా, నితీశ్ రాణా, గుర్నే, రస్సెల్‌కు తలా ఓ వికెట్ దక్కాయి.

First published: May 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...