KKR vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్... కోల్‌కతా బ్యాటింగ్...

రాజస్థాన్ రాయల్స్ తరుపున ఓసానే థామన్ ఐపీఎల్ ఎంట్రీ... ధవల్ కుల్‌కర్ణికి బదులుగా వరుణ్ అరోన్‌కు అవకాశం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 25, 2019, 7:45 PM IST
KKR vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్... కోల్‌కతా బ్యాటింగ్...
రాజస్థాన్ రాయల్స్ తరుపున ఓసానే థామన్ ఐపీఎల్ ఎంట్రీ... ధవల్ కుల్‌కర్ణికి బదులుగా వరుణ్ అరోన్‌కు అవకాశం...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 25, 2019, 7:45 PM IST
IPL 2019 Live Score, KKR vs RR Match at Eden Gardens: కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్ బరిలో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అట్టడుగు ఉన్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు హ్యాట్రిక్ విజయాలతో కింద నుంచి రెండో స్థానానికి వెళ్లింది. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో కిందకు పడిపోయింది. ఈ మ్యాచ్ గెలిచి, మళ్లీ పైకి రావాలని కోరుకుంటోంది రాజస్థాన్. ఈ మ్యాచ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ తరుపున ఓసానే థామన్ ఐపీఎల్ ఎంట్రీ ఇస్తుండగా... ధవల్ కుల్‌కర్ణికి బదులుగా వరుణ్ అరోన్‌కు అవకాశం ఇచ్చాడు స్టీవ్ స్మిత్. మరోవైపు కరియప్ప స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నే బదులుగా బ్రాత్‌వైట్‌లకు జట్టులో చోటు కల్పించింది కోల్‌కతా.

కోల్‌కతా నైట్‌రైడర్స్: క్రిస్‌లీన్, సునీల్ నరైన్,శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, రింకూ సింగ్, ఆండ్రే రస్సెల్, బ్రాత్‌వైట్, పియూష్ చావ్లా, ఎర్రా పృథ్వీరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

రాజస్థాన్ రాయల్స్: అజింకా రెహానే, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, రియాన్ పరాగ్,స్టువర్ట్ బిన్నీ, శ్రేయాస్ గోపాల్, అర్చర్, జయదేవ్ ఉనాద్కడ్, ఓసానే థామస్, వరుణ్ అరోన్

First published: April 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...