KKR vs RR: సిక్సర్ల మోత మోగించిన దినేశ్ కార్తీక్... కోల్‌కతా భారీ స్కోరు...
50 బంతుల్లో 97 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్... మూడు పరుగులతో సెంచరీ మిస్... వరుణ్ అరోన్‌కు రెండు వికెట్లు...

50 బంతుల్లో 97 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్... మూడు పరుగులతో సెంచరీ మిస్... వరుణ్ అరోన్‌కు రెండు వికెట్లు...
- News18 Telugu
- Last Updated: April 25, 2019, 10:07 PM IST
IPL 2019 Live Score, KKR vs RR Match at Eden Gardens: సునీల్ నరైన్ కొట్టలేకపోయాడు. బౌలర్లను ఊచకోత కోసే ఆండ్రే రస్సెల్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. యంగ్ బ్యాట్స్‌మెన్ నితీశ్ రాణా, శుబ్‌మన్ గిల్ కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఇక కోల్‌కతా భారీ స్కోరు చేయడం కష్టమే అనుకుంటున్న సమయంలో కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు దినేశ్ కార్తీక్. 50 బంతుల్లో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు దినేశ్ కార్తీక్. టాస్ ఓడి, బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగుల భారీ స్కోరు నమోదుచేసింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన మొదటి ఓవర్ మూడో బంతికే క్రిస్‌లీన్ వికెట్ కోల్పోయింది కోల్‌కతా. ఆరోన్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు క్రిస్‌లీన్. ఆ తర్వాత శుబ్‌మన్ గిల్ 14 పరుగులు, నితీశ్ రాణా 21 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది కోల్‌కతా. అదరగొడతారనుకున్న సునీల్ నరైన్ 11 పరుగులు చేసి రనౌట్ కాగా, భారీ హిట్టర్ ఆండ్రే రస్సెల్ 14 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత బ్రాత్‌వైట్ కూడా 5 పరుగులకే అవుట్ అయ్యాడు. అప్పటికి 17.2 ఓవర్లలో జట్టు స్కోరు 131 పరుగులు మాత్రమే. కోల్‌కతా 150 మార్క్ కూడా దాటదనుకున్న సందర్భంలో దినేశ్ కార్తీక్ రెచ్చిపోయాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా దూకుడు కొనసాగించి, 50 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు దినేశ్ కార్తీక్. రింకూ సింగ్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రింకూతో కలిసి చివరి 16 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు దినేశ్ కార్తీక్.
ఐపీఎల్ చరిత్రలోనే మొదటి సెంచరీ నమోదుచేసిన బ్రెండన్ మెక్కల్లమ్ 158 పరుగుల స్కోరు తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు దినేశ్ కార్తీక్. వరుణ్ అరోన్‌కు రెండు వికెట్లు, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనాద్కడ్, ఓషాన్ థామస్లకు తలా ఓ వికెట్ దక్కాయి.

Ind vs WI: విండీస్ లక్ష్యం 289 పరుగులు...చివర్లో కాపాడిన జాదవ్..
Ind vs WI: చెత్త షాట్‌తో టీమిండియా ఆశలపై నీళ్లు జల్లిన రిషబ్ పంత్..తీరు మారలేదుగా..
India vs West Indies: కోహ్లీ, రోహిత్ ఔట్...పరుగుల వేటలో భారత్
మద్యం మత్తులో పక్కింటివారిపై టీమిండియా మాజీ క్రికెటర్ దాడి
రేపటి నుంచి విండీస్‌తో మూడు వన్డేల సిరీస్...గాయంతో భువీ దూరం...
IPL 2020 : ఐపీఎల్ వేలం షురూ...మన ఆటగాళ్లు మరీ అంత చీప్ అయిపోయారా...