KKR vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా... విరాట్ సేన బ్యాటింగ్...

IPL 2019 Live Score, KKR vs RCB Match at Eden Gardens: తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి బెంగళూరు జట్టులోకి డేల్ స్టెయిన్ ఎంట్రీ... అనారోగ్యం కారణంగా డివిల్లియర్స్‌కు విశ్రాంతి.

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 19, 2019, 7:47 PM IST
KKR vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా... విరాట్ సేన బ్యాటింగ్...
IPL 2019 Live Score, KKR vs RCB Match at Eden Gardens: తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి బెంగళూరు జట్టులోకి డేల్ స్టెయిన్ ఎంట్రీ... అనారోగ్యం కారణంగా డివిల్లియర్స్‌కు విశ్రాంతి.
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 19, 2019, 7:47 PM IST
IPL 2019 Live Score, KKR vs RCB Match at Eden Gardens: బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా జట్టు కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వరుసగా ఆరు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన బెంగళూరు జట్టు, ఏడో మ్యాచ్‌లో గెలిచి తొలి విజయాన్ని రుచి చూసింది. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌లో మళ్లీ ఓడిన బెంగళూరు జట్టుకు కాస్తో కూస్తో ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ నుంచి ప్రతీ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 206 పరుగులు భారీ లక్ష్యాన్ని విజయవంతంగా చేధించి, రికార్డు క్రియేట్ చేసింది కోల్‌కతా. ఆండ్రూ రస్సెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో విరాట్ సేనకు షాక్ ఇచ్చాడు. అయితే పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న టాప్ 4లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఈ మ్యాచ్ గెలవడం వారికి ఎంతో అవసరం. అయితే ఏబీ డివిల్లియర్స్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో క్లాసీన్‌కు అవకాశం కల్పించిన విరాట్ సేన, డేల్ స్టెయిన్‌ను తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి తీసుకున్నాడు. స్టెయిన్ ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడంలో బెంగళూరు జట్టుకు సహకరిస్తాడని భావిస్తున్నాడు విరాట్ కోహ్లీ.

బెంగళూరు రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు: పార్థివ్ పటేల్, మొయిన్ ఆలీ, విరాట్ కోహ్లీ, హెన్రీచ్ క్లాసిన్, మర్కస్ స్టోయినిస్, అక్ష్‌దీప్ నాథ్, పవన్ నేగి, నవదీప్ శైనీ, మహ్మద్ సిరాజ్, చాహాల్, డేల్ స్టెయిన్




కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు: సునీల్ నరైన్, క్రిస్ లీన్, రాబిన్ ఊతప్ప, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, శుబ్‌మన్ గిల్, ఆండ్రే రస్సెల్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, హ్యారీ గుర్నే, ప్రసిద్ధ్ కృష్ణ

First published: April 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...