KKR vs DC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ... కోల్‌కత్తా బ్యాటింగ్...

IPL 2019 Live Score, KKR vs DC Match at Kolkata: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆందోళన కలిగిస్తున్న శిఖర్ ధావన్ ఫామ్... రస్సెల్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 12, 2019, 7:44 PM IST
KKR vs DC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ... కోల్‌కత్తా బ్యాటింగ్...
IPL 2019 Live Score, KKR vs DC Match at Kolkata: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆందోళన కలిగిస్తున్న శిఖర్ ధావన్ ఫామ్... రస్సెల్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్...
  • Share this:
IPL 2019 Live Score, KKR vs DC Match at Kolkata: కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కత్తా బ్యాటింగ్ చేయనుంది. కోల్‌కత్తా టేబుల్ టాప్ 2 ప్లేస్‌లో కొనసాగుతుండగా, యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ మూడు విజయాలతో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే కోల్‌కత్తా జట్టు, చెన్నై సూపర్ కింగ్స్‌ను కిందకి లాగి, మళ్లీ టాప్‌లోకి వెళ్తుంది. ఢిల్లీ విజయం సాధిస్తే ఏకంగా టాప్ 4లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దక్కుతుంది. దాంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. గత మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఘోరంగా ఓడిన కోల్‌కత్తా... ఈ మ్యాచ్‌లో మళ్లీ గ్రాండ్ విక్టరీ సాధించాలని పట్టుదలతో ఉంది. ఆండ్రే రస్సెల్ ఫామ్ కోల్‌కత్తాకు కొండంత బలాన్ని అందిస్తోంది. మరోవైపు జట్టులో స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కూడా ధావన్ డకౌట్ అయ్యాడు. ప్రపంచకప్‌ జట్టులో తీవ్రమైన పోటీ నెలకొన్న సందర్భంలో ధావన్ రాణింపు, అతనికీ, ఢిల్లీ జట్టుకు కీలకం కానుంది. ఢిల్లీ జట్టులో సందీప్ లామిచానే ప్లేస్‌లో కిమో పాల్ స్థానం దక్కించుకోగా... కోల్‌కత్తా మూడు మార్పులతో బరిలో దిగుతోంది. నరైన్, క్రిస్‌లీన్, గుర్నే స్థానాల్లో జో డిన్లే, లూకీ ఫర్గూసన్, బ్రాత్‌వైట్‌లకు అవకాశం కల్పించింది కోల్‌కత్తా.


ఢిల్లీ క్యాపిటల్ జట్టు: శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, పృథ్వీ షా, కిమో పాల్, కోలిన్ ఇన్‌గ్రామ్, క్రిస్ మోరిస్, రిషబ్ పంత్, కగిసో రబాడా, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, రాహుల్ త్రివాఠియా

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు: రాబిన్ ఊతప్ప, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్, శుబ్‌మన్ గిల్, ఆండ్రే రస్సెల్, జో డిన్లే, బ్రాత్‌‌వైట్, లూకీ ఫర్గూసన్, పియూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ
POINTS TABLE:


SCHEDULE TIME TABLE:
ORANGE CAP:


PURPLE CAP:


RESULTS TABLE:

First published: April 12, 2019, 7:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading