DC vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ ... ఢిల్లీ బ్యాటింగ్...

IPL 2019 Live Score, DC vs SRH Match in Delhi: అనారోగ్యం కారణంగా బరిలో దిగని సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియంసన్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 4, 2019, 7:59 PM IST
DC vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ ... ఢిల్లీ బ్యాటింగ్...
అబుదాబిలో ఈ రోజు సాయంత్రం 7.30 నిమిషాలకు ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 11వ ఐపిఎల్ మ్యాచ్ జరగనుంది. ఐపిఎల్–2020లో డిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు రెండు మ్యాచ్లను గెలిచినప్పటికీ, ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలోనూ పరాజయం పాలై ఇప్పటివరకు ఖాతా కూడా తెరవలేదు. కాగా, సన్రైజర్స్ తప్ప మిగతా అన్ని జట్లు కనీసం ఒక్క మ్యాచ్లోనైనా విజయం సాధించాయి.
  • Share this:
IPL 2019 Live Score, DC vs SRH Match in Delhi: ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఫిరోజా షా కోట్లా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్స్ డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో. ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ 100కి పైగా భాగస్వామ్యాలు నెలకొల్పి, సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు వార్నర్, బెయిర్ స్టో. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్‌లో అయితే ఏకంగా 185 పరుగుల భారీ భాగస్వామ్యంతో పాటు ఇద్దరూ సెంచరీలతో అదరగొట్టారు. ఇలాంటి భీకర ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ ఓపెనర్లను యంగ్ టీమ్‌గా గుర్తింపు పొందిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా ఎదుర్కొంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో సూపర్ విక్టరీ సాధించిన ఢిల్లీ, మంచి ఉత్సాహంతో ఉంది. అయితే మొదటి మ్యాచ్‌లో సిక్సర్లు, ఫోర్లతో వీరవిహారం చేసిన యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్... ఆ తర్వాతి మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. పృథ్వీషా 99 పరుగులతో మంచి టచ్‌లోకి రావడం ఢిల్లీకి కలిసొచ్చే అంశాలు. మరోవైపు హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియంసన్ తరుచూ అనారోగ్యానికి గురవుతుండడం సన్‌రైజర్స్‌ను కలవరానికి గురి చేస్తోంది. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన కేన్ విలియంసన్ ఈ రోజు మ్యాచ్‌లో కూడా బరిలో దిగడం లేదు.
IPl 2019 Live Score, Dc vs SRH, Delhi capital vs Sun Risers Hyderabad, SunRisers Hyderabad team ipl 2019, Delhi Capitals team ipl 2019, Delhi capitals captain, Rishabh pant, Shreyal ayar, Kane williamson, David warner ipl 2019, Bairstow ipl 2019, Dc vs SRH live score, srh vs dc live score ipl, Rashid khan ipl 2019, Yousuf pathan ipl 2019, david warner - bairstow partnership ipl 2019, ఢిల్లీ vs హైదరాబాద్ ఐపిఎల్ 2019, ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, ఐపిఎల్ 2019 పూర్తి షెడ్యూల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, కేన్ విలియంసన్, రషీద్ ఖాన్, యూసఫ్ పఠాన్, హైదరాబాద్ టీమ్ ఐపీఎల్ 2019
బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ జోడి


ఢిల్లీ క్యాపిటల్ జట్టు: శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, పృథ్వీ షా, హనుమ విహారి, కోలిన్ ఇన్‌గ్రామ్, క్రిస్ మోరిస్, రిషబ్ పంత్, సందీప్ లామిచానె, కగిసో రబాడా, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, రాహుల్ త్రివాఠియా

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, మనీశ్ పాండే, దీపక్ హుడా, విజయ్ శంకర్, యూసఫ్ పఠాన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, సందీప్ శర్మ, మహ్మద్ నబీ

POINTS TABLE:


SCHEDULE TIME TABLE:



ORANGE CAP:


PURPLE CAP:


RESULTS TABLE:
Published by: Ramu Chinthakindhi
First published: April 4, 2019, 7:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading