Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    DC vs SRH: స్వల్పస్కోరుకే పరిమితమైన ఢిల్లీ... సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 130...

    IPL 2019 Live Score, DC vs SRH Match in Delhi: 43 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్...

    Chinthakindhi.Ramu | news18-telugu
    Updated: April 4, 2019, 9:53 PM IST
    DC vs SRH: స్వల్పస్కోరుకే పరిమితమైన ఢిల్లీ... సన్‌రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ 130...
    IPL 2019 Live Score, DC vs SRH Match in Delhi: 43 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్...
    • Share this:
    IPL 2019 Live Score, DC vs SRH Match in Delhi: టాస్ ఓడి, బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. హైదరాబాద్ బౌలర్లు విజృంభించి వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో యంగ్ ఢిల్లీ టీమ్... పరుగులు చేసేందుకు కష్టాలు పడింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఒంటరి పోరాటం చేయడంతో ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది ఢిల్లీ. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప్రారంభంలోనే ఢిల్లీకి గట్టి షాక్ తగిలింది. గత మ్యాచ్‌లో 99 పరుగులతో వీరవిహరం చేసిన పృథ్వీషా కేవలం 11 పరుగులకే భువనేశ్వర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ 12 పరుగులు, రిషబ్ పంత్ 5 పరుగులు, రాహుల్ త్రివాఠియా 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 61 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇన్‌గ్రామ్ కూడా 5 పరుగులకే అవుటై పెవిలియన్ చేరాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌‌ను రషీద్ ఖాన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. 41 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు శ్రేయాస్ అయ్యర్. 93 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయింది ఢిల్లీ.

    ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోకుండా వరుస వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచారు. క్రిస్ మోరిస్ 17 పరుగులు, రబాడా మూడు పరుగులు చేసి పెవిలియన్ చేయగా అక్షర్ పటేల్ 13 బంతుల్లో 1 ఫోర్, రెండు సిక్సర్లతో 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సిద్ధార్థ్ కౌల్,నబీ, భువనేశ్వర్ కుమార్‌లకు రెండేసి వికెట్లు దక్కగా... రషీద్ ఖాన్, సందీప్ శర్మలకు చెరో వికెట్ దక్కాయి.
    First published: April 4, 2019, 9:46 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading