DC vs SRH: మంచి స్కోరు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఆఖరి ఓవర్‌లో మూడు వికెట్లు..

గప్టిల్ 36, మనీశ్ పాండే 30, విలియంసన్ 28, విజయ్ శంకర్ 25 పరుగులు... కిమో పాల్‌కు 3 వికెట్లు..

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 8, 2019, 9:41 PM IST
DC vs SRH: మంచి స్కోరు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఆఖరి ఓవర్‌లో మూడు వికెట్లు..
గప్టిల్ 36, మనీశ్ పాండే 30, విలియంసన్ 28, విజయ్ శంకర్ 25 పరుగులు... కిమో పాల్‌కు 3 వికెట్లు..
  • Share this:
IPL 2019 Live Score, DC vs SRH Match Eliminator in Vizag: సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఎలిమేటర్ 1 మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగుల భారీ స్కోరు చేసింది. బ్యాటింగ్ ప్రారంభించిన మొదటి బంతికే అద్భుత బంతితో బౌల్ట్... వృద్ధమాన్ సాహాను అవుట్ చేశాడు. అయితే రివ్యూ తీసుకున్న సాహాకు అనుకూలంగా నిర్ణయం రావడంతో సన్‌రైజర్స్ ఓపెనర్ బతికిపోయాడు. గప్టిల్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో మూడు ఓవర్లలో 30 పరుగులు రాబట్టింది హైదరాబాద్. ఆ తర్వాత సాహా అవుట్ అయ్యాడు. నాలుగో ఓవర్ మొదటి బంతికే సాహాను అవుట్ చేశాడు ఇషాంత్ శర్మ. గప్టిల్ 19 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మనీశ్ పాండే 30 పరుగులు, కేన్ విలియంసన్ 28 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. విజయ్ శంకర్ 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీపక్ హూడా 4 పరుగులు, నబీ 20 పరుగులు చేయగా రషీద్ ఖాన్ డకౌట్ అయ్యాడు. చివరి ఓవర్‌లో వరుస బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అందులో ఒకే బంతికి రెండు వికెట్లు ఉండడం విశేషం. వైడ్‌కి పరుగు తీసే ప్రయత్నంలో దీపక్ హుడా రనౌట్ కాగా, తర్వాతి బంతికి రషీద్ ఖాన్ క్యాచ్ ఇచ్చి, పెవిలియన్ చేరాడు.

కిమో పాల్‌కు మూడు వికెట్లు దక్కగా, ఇషాంత్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి. బౌల్ట్,అమిత్ మిశ్రా చెరో వికెట్ తీశారు. ఈ సీజన్‌లో రెండు వందలకు పైగా స్కోరు చేసిన రెండు మ్యాచుల్లో మాత్రమే సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. మిగిలిన మ్యాచుల్లో పరాజయం ఎదురైంది. మరి కీలకపోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు ఏ మేరకు రాణిస్తారనే దానిపైనే ఎస్ఆర్‌హెచ్ విజయం ఆధారపడి ఉంది.

First published: May 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...