DC vs SRH: బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్... వృద్ధమాన్ సాహా అవుట్...

8 పరుగులు చేసిన సాహా... ఇషాంత్ శర్మకు తొలి వికెట్... ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 10న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలబడుతుంది. ఓడిన జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంటుంది.

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 8, 2019, 7:54 PM IST
DC vs SRH: బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్... వృద్ధమాన్ సాహా అవుట్...
8 పరుగులు చేసిన సాహా... ఇషాంత్ శర్మకు తొలి వికెట్... ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 10న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలబడుతుంది. ఓడిన జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంటుంది.
  • Share this:
IPL 2019 Live Score, DC vs SRH Match Eliminator in Vizag: సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న ఎలిమేటర్ 1 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ బ్యాటింగ్‌కు దిగింది. బ్యాటింగ్ ప్రారంభించిన మొదటి బంతికే అద్భుత బంతితో బౌల్ట్... వృద్ధమాన్ సాహాను అవుట్ చేశాడు. అయితే రివ్యూ తీసుకున్న సాహాకు అనుకూలంగా నిర్ణయం రావడంతో సన్‌రైజర్స్ ఓపెనర్ బతికిపోయాడు. మూడు ఓవర్లలో 30 పరుగులు రాబట్టిన తర్వాత ఓపెనర్లు సాహా అవుట్ అయ్యాడు. నాలుగో ఓవర్ మొదటి బంతికే సాహాను అవుట్ చేశాడు ఇషాంత్ శర్మ...

ఇరు జట్ల మధ్య జరిగిన గ్రూపు మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ మ్యాచ్ గెలవగా, ఢిల్లీకి ఓ విజయం దక్కింది. విశేషమేంటంటే... ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధిస్తే, హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఘనవిజయం సొంతం చేసుకుంది. రెండు సమయాల్లోనే ఢిల్లీ స్వల్ప స్కోరుకే పరిమితం కాగా, ఓ మారు లక్ష్యాన్ని సులువుగా చేధించిన హైదరాబాద్... మరో మారు చిత్తుగా ఓడింది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: పృథ్వీషా, శిఖర్ ధావన్, మున్రో, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, రూథర్‌ఫర్డ్, అక్షర్ పటేల్, కిమో పాల్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, బౌల్ట్

సన్‌రైజర్స్ హైదరాబాద్: సాహా, గుప్టిల్, మనీశ్ పాండే,కేన్ విలియంసన్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, దీపక్ హుడా, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, బసిల్ తంపీ
First published: May 8, 2019, 7:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading