DC vs MI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్... ఢిల్లీ ఫీల్డింగ్...

IPL 2019 Live Score, DC vs MI Match at Feroz Shah Kotla: 2017 నుంచి ఢిల్లీ జట్టుపై ఒక్క విజయం కూడా సాధించని ముంబై ఇండియన్స్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 18, 2019, 7:53 PM IST
DC vs MI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్... ఢిల్లీ ఫీల్డింగ్...
IPL 2019 Live Score, DC vs MI Match at Feroz Shah Kotla: 2017 నుంచి ఢిల్లీ జట్టుపై ఒక్క విజయం కూడా సాధించని ముంబై ఇండియన్స్...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 18, 2019, 7:53 PM IST
IPL 2019 Live Score, DC vs MI Match at Feroz Shah Kotla: ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీతో తలబడిన మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడింది. యంగ్ సెన్సేషన్ రిషబ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. 27 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు రిషబ్ పంత్. టోర్నీలో యంగ్ జట్టుగా గుర్తింపు పొందిన ఢిల్లీ క్యాపిటల్స్... అంచనాలకు మించి రాణిస్తోంది. శిఖర్ ధావన్, పృథ్వీషా, శ్రేయాస్ అయ్యర్‌తో పాటు బౌలర్ రబాడా అదరగొడుతున్నాడు. 8 మ్యాచుల్లో 5 విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన ముంబై జట్టు కూడా సరిగా 5 విజయాలే సొంతం చేసుకుంది. అయితే రన్‌రేట్ కారణంగా ముంబై మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్ గెలిస్తే ముంబై రెండో స్థానంలోకి వెళుతుంది. అయితే 2017 నుంచి ఢిల్లీ జట్టుపై ఒక్క విజయం కూడా నమోదుచేయలేకపోవడం ముంబై జట్టును భయపెడుతున్న అంశం.

ముంబై జట్టు: రోహిత్ శర్మ, డి కాక్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా, యువరాజ్ సింగ్, పోలార్డ్, హార్ధిక్ పాండ్యా, బెన్ కట్టింగ్, జయంత్ యాదవ్, లసిత్ మలింగ, బుమ్రా

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: శిఖర్ ధావన్, పృథ్వీషా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కోలిన్ మున్రో, కీమో పాల్, అక్షర్ పటేల్, క్రిస్ మోరిస్, రగిసో రబాడా, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ



First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...