DC vs MI: పాండ్యా బ్రదర్స్ సూపర్ షో... మంచి స్కోరు సాధించిన ముంబై ఇండియన్స్...

IPL 2019 Live Score, DC vs MI Match at Feroz Shah Kotla: కృనాల్ పాండ్యా 37 నాటౌట్, హర్దిక్ పాండ్యా 32 పరుగులు, డి కాక్ 35 పరుగులు... రబాడాకు రెండు వికెట్లు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 18, 2019, 9:53 PM IST
DC vs MI: పాండ్యా బ్రదర్స్ సూపర్ షో... మంచి స్కోరు సాధించిన ముంబై ఇండియన్స్...
IPL 2019 Live Score, DC vs MI Match at Feroz Shah Kotla: కృనాల్ పాండ్యా 37 నాటౌట్, హర్దిక్ పాండ్యా 32 పరుగులు, డి కాక్ 35 పరుగులు... రబాడాకు రెండు వికెట్లు...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 18, 2019, 9:53 PM IST
IPL 2019 Live Score, DC vs MI Match at Feroz Shah Kotla: టాస్ గెలిచి, బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 168 పరుగుల గౌరవప్రదమైన స్కోరు నమోదుచేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, డి కాక్ కలిసి దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో 6.1 ఓవర్లలో 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 22 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 30 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బెన్ కట్టింగ్ 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసిన డి కాక్ కూడా రనౌట్ కావడంతో 74 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ముంబై జట్టు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు చేసి పెవిలియన్ చేరగా... హార్ధిక్ పాండ్యా 15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కృనాల్ పాండ్యా 26 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాండ్యా బ్రదర్స్ దూకుడు కారణంగా చివరి 3 ఓవర్లలో 50 పరుగులు రాబట్టింది ముంబై జట్టు. ఢిల్లీ బౌలర్లలో రబాడాకు రెండు వికెట్లు దక్కగా, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.

ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టీ20ల్లో 8వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. క్రిస్‌గేల్, మెక్ కల్లమ్, పోలార్డ్, మాలిక్, వార్నర్, రైనా, రోహిత్ తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ.



First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...