DC vs KXIP: క్రిస్‌ గేల్ హాఫ్ సెంచరీ... మంచి స్కోరు సాధించిన పంజాబ్...

సందీప్ లామిచానేకు మూడు వికెట్లు... హాఫ్ సెంచరీ చేసిన క్రిస్ గేల్... మన్‌దీప్ సింగ్ 30 పరుగులు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 20, 2019, 10:02 PM IST
DC vs KXIP: క్రిస్‌ గేల్ హాఫ్ సెంచరీ... మంచి స్కోరు సాధించిన పంజాబ్...
క్రిస్ గేల్
  • Share this:
IPL 2019 Live Score, DC vs KXIP Match at Delhi: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగుల స్కోరు చేసింది. కెఎల్ రాహుల్ 12 పరుగులు, మయాంక్ అగర్వాల్ 2 పరుగులు, డేవిడ్ మిల్లర్ 7 పరుగులు చేసి వెనుదిరిగారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా, సిక్సర్లు, బౌండరీలతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు క్రిస్‌గేల్. 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసిన గేల్... సందీప్ లామిచానే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. బౌండరీ లైన్ దగ్గర అక్షర్ పటేల్ అద్భుత క్యాచ్ పట్టి, గేల్‌ను పెవిలియన్ పంపాడు. మన్‌దీప్ సింగ్ 30 పరుగులు చేసి అవుట్ కాగా, సామ్ కుర్రాన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత అశ్విన్, హర్‌ప్రీత్ కలిసి నిలకడగా బ్యాటింగ్ చేస్తూ స్కోరును 150 పరుగుల మార్క్ దాటించారు. అయితే స్కోరు వేగం పెంచేందుకు ప్రయత్నించిన అశ్విన్, రబాడా వేసిన చివరి ఓవర్ మొదటి బంతికి అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్స్‌గా మలిచిన హర్‌ప్రీత్... స్కోరును 160 మార్క్ దాటించాడు. విల్‌జీన్ రెండు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చిన సందీప్ లామిచానేకు మూడు వికెట్లు దక్కగా... రబాడా, అక్షర్ పటేల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

First published: April 20, 2019, 9:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading