DC vs KXIP: శ్రేయాస్, ధావన్ హాఫ్ సెంచరీలు... ఢిల్లీ ఘన విజయం...

శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ... అద్భుత ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్... 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఢిల్లీ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 21, 2019, 6:38 AM IST
DC vs KXIP: శ్రేయాస్, ధావన్ హాఫ్ సెంచరీలు... ఢిల్లీ ఘన విజయం...
శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ... అద్భుత ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్... 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఢిల్లీ...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 21, 2019, 6:38 AM IST
IPL 2019 Live Score, DC vs KXIP Match at Delhi: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. పంజాబ్ విధించిన 164 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది ఢిల్లీ. ఓపెనర్ పృథ్వీషా 11 పరుగులకే పెవిలియన్ చేరినా... శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ కలిసి రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 41 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్స్‌తో 56 పరుగులు చేసిన ధావన్, విల్‌జీన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కూడా 6 పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే కోలిన్ ఇన్‌గ్రామ్‌తో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. 9 బంతుల్లో 4 బౌండరీలతో 19 పరుగులు చేసిన ఇన్‌గ్రామ్... రన్‌రేట్ తగ్గించడంలో కీ రోల్ పోషించాడు. అయితే ఇన్‌గ్రామ్ అవుటైన తర్వాతి బంతికే అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు. అప్పటికి ఢిల్లీ విజయానికి 8 బంతుల్లో 8 పరుగులు కావాలి. శ్రేయాస్ అయ్యర్, రూథర్‌ఫర్డ్ చెరో సింగిల్ తీయడంతో ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ విక్టరీకి 6 పరుగులు అవసరమయ్యాయి. మొదటి బంతికి రూథర్‌ఫర్డ్ సింగిల్ తీయగా, రెండో బంతికి 2 పరుగులు రాబట్టాడు శ్రేయాస్ అయ్యర్. మూడో బంతికి ఫోర్ కొట్టడంతో ఢిల్లీ విజయం సాధించింది.

IPl Live Score, DC vs KXIP, IPL 2019, Delhi capitals vs Kings xi punjab, delhi points table ipl, punjab points ipl 019, ఐపీఎల్ 2019, ఐపీఎల్ షెడ్యూల్ 2019, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్, పంజాబ్ ఎలెవన్ కింగ్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్, అశ్విన్, క్రిస్ గేల్, పృథ్వీషా, రిషబ్ పంత్
క్రిస్ గేల్


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 163 పరుగుల స్కోరు చేసింది. కెఎల్ రాహుల్ 12 పరుగులు, మయాంక్ అగర్వాల్ 2 పరుగులు, డేవిడ్ మిల్లర్ 7 పరుగులు చేసి వెనుదిరిగారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా, సిక్సర్లు, బౌండరీలతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు క్రిస్‌గేల్. 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేసిన గేల్... సందీప్ లామిచానే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. బౌండరీ లైన్ దగ్గర అక్షర్ పటేల్ అద్భుత క్యాచ్ పట్టి, గేల్‌ను పెవిలియన్ పంపాడు. మన్‌దీప్ సింగ్ 30 పరుగులు చేసి అవుట్ కాగా, సామ్ కుర్రాన్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత అశ్విన్, హర్‌ప్రీత్ కలిసి నిలకడగా బ్యాటింగ్ చేస్తూ స్కోరును 150 పరుగుల మార్క్ దాటించారు. అయితే స్కోరు వేగం పెంచేందుకు ప్రయత్నించిన అశ్విన్, రబాడా వేసిన చివరి ఓవర్ మొదటి బంతికి అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్స్‌గా మలిచిన హర్‌ప్రీత్... స్కోరును 160 మార్క్ దాటించాడు. విల్‌జీన్ రెండు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చిన సందీప్ లామిచానేకు మూడు వికెట్లు దక్కగా... రబాడా, అక్షర్ పటేల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.

First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...