DC vs KXIP: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ... పంజాబ్ బ్యాటింగ్...

మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ఢిల్లీ, పంజాబ్ మధ్య పోరు... ఈ సీజన్‌లో తలబడిన మొదటి మ్యాచ్‌లో ఉత్కంఠ పోరు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 20, 2019, 8:03 PM IST
DC vs KXIP: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ... పంజాబ్ బ్యాటింగ్...
మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ఢిల్లీ, పంజాబ్ మధ్య పోరు... ఈ సీజన్‌లో తలబడిన మొదటి మ్యాచ్‌లో ఉత్కంఠ పోరు...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 20, 2019, 8:03 PM IST
IPL 2019 Live Score, DC vs KXIP Match at Delhi: ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు కెప్టెన్
శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. ఢిల్లీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, పంజాబ్ జట్టు నాలుగో స్థానంలో ఉంది. ఇరు జట్లు ఐదేసీ విజయాలతో ఉండడంతో ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకు రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంటుంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పోరాడి ఓడింది. ఈ మ్యాచ్‌లో గెలిచి, ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్. యంగ్ టీమ్‌గా గుర్తింపు పొందిన ఢిల్లీ, క్రిస్ గేల్, రాహుల్, అశ్విన్ వంటి సీనియర్స్ ఉన్న జట్టును ఓడించి, ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలని చూస్తోంది.

పంజాబ్ జట్టు: లోకేశ్ రాహుల్, క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, మన్‌దీప్ సింగ్, అశ్విన్, సామ్ కుర్రాన్, హార్‌ప్రీత్ బ్రార్, మురుగన్ అశ్విన్, హర్దూస్ విల్‌జిల్, షమీ

ఢిల్లీ జట్టు: పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, పంత్, కోలిన్ ఇన్‌గ్రామ్, రుథర్‌ఫర్డ్, అక్షర్ పటేల్, రబాడా, అమిత్ మిశ్రా, సందీప్ లామిచానే, ఇషాంత్ శర్మ

First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...