CSK vs SRH: మెరిసిన మనీశ్ పాండే... భారీ స్కోరు చేసిన సన్‌రైజర్స్...

CSK vs SRH: 83 పరుగులు చేసిన మనీశ్ పాండే‌..., డేవిడ్ వార్నర్ మరో హాఫ్ సెంచరీ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 23, 2019, 10:03 PM IST
CSK vs SRH: మెరిసిన మనీశ్ పాండే... భారీ స్కోరు చేసిన సన్‌రైజర్స్...
CSK vs SRH: 83 పరుగులు చేసిన మనీశ్ పాండే‌..., డేవిడ్ వార్నర్ మరో హాఫ్ సెంచరీ...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 23, 2019, 10:03 PM IST
IPL 2019 Live Score, CSK vs SRH Match at Chennai: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోరు చేసింది. గత కొన్ని సీజన్లుగా ఘోరంగా విఫలమవుతూ వచ్చిన మనీశ్ పాండే... అద్భుత ప్రదర్శనతో చెలరేగిపోయాడు. అతనికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ కూడా తోడు కావడంతో మంచి స్కోరు నమోదుచేసింది ఎస్ఆర్‌హెచ్. బ్యాటింగ్ ప్రారంభించిన రెండో ఓవర్‌లోనే సూపర్ ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టో వికెట్ కోల్పోయింది సన్‌రైజర్స్. హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో బెయిర్ స్టో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మనీశ్ పాండేతో కలిసి 115 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు డేవిడ్ వార్నర్. 45 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ను కూడా హర్భజన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. ఓపెనర్లు ఇద్దరూ బజ్జీ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి, పెవిలియన్ చేరడం విశేషం. ఆ తర్వాత విజయ్ శంకర్ 26 పరుగులు చేసి చాహార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 83 పరుగులు చేసిన మనీశ్ పాండే‌తో పాటు యూసఫ్ పఠాన్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఒకానొక దశలో హైదరాబాద్ స్కోరు 200 దాటుతుందని భావించినా, చివరి రెండు ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన చెన్నై బౌలర్లు ఆ మార్కు దాటనివ్వలేదు. ఐపీఎల్ కెరీర్‌లోనే మొట్టమొదటి సెంచరీ చేసిన భారతీయ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన మనీశ్ పాండే... ఆ తర్వాత ఆటతీరు కనబర్చలేకపోయాడు. మళ్లీ మనీశ్‌లో మునుపటి జోష్ కనిపించింది. అదీగాక ఓపెనర్లు తప్ప, మిడిల్ ఆర్డర్ రాణించడం లేదనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ బాధను తీర్చేశాడు మనీశ్ పాండే.


First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...