CSK vs SRH: సన్‌రైజర్స్‌పై చెన్నై సూపర్ విక్టరీ... షేన్ వాట్సన్ సెంచరీ మిస్...

19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించిన చెన్నై సూపర్ కింగ్స్... 4 పరుగులతో సెంచరీ మిస్ చేసుకున్న షేన్ వాట్సన్... ఫ్లేఆఫ్స్‌లో ప్లేస్ ఫిక్స్ చేసుకున్న చెన్నై...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 24, 2019, 9:03 AM IST
CSK vs SRH: సన్‌రైజర్స్‌పై చెన్నై సూపర్ విక్టరీ... షేన్ వాట్సన్ సెంచరీ మిస్...
19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించిన చెన్నై సూపర్ కింగ్స్... 4 పరుగులతో సెంచరీ మిస్ చేసుకున్న షేన్ వాట్సన్... ఫ్లేఆఫ్స్‌లో ప్లేస్ ఫిక్స్ చేసుకున్న చెన్నై...
  • Share this:
IPL 2019 Live Score, CSK vs SRH Match at Chennai: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విధించిన 176 పరుగుల విజయలక్ష్యాన్ని విజయవంతంగా చేధించింది చెన్నై సూపర్ కింగ్స్. 3 పరుగులకే డుప్లిసిస్ వికెట్ కోల్పోయినా షేన్ వాట్సన్ అద్బుతంగా పోరాడి సూపర్ విక్టరీ అందించాడు. సురేశ్ రైనా 38 పరుగులు, అంబటిరాయుడు 21 పరుగులతో ఆదుకున్నా... 53 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 96 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. విజయానికి రెండు బంతుల్లో ఒక్క పరుగు కావాల్సిన దశలో అంబటి రాయుడు అవుట్ కావడంతో అంతా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్, తాను ఎదుర్కొన్న మొదటి బంతికే సింగిల్ రాబట్టడంతో ఆతిథ్య జట్టు విజయాన్ని అందుకుంది. 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్... ఈ సీజన్‌లో ఫ్లేఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోరు చేసింది. గత కొన్ని సీజన్లుగా ఘోరంగా విఫలమవుతూ వచ్చిన మనీశ్ పాండే... అద్భుత ప్రదర్శనతో చెలరేగిపోయాడు. అతనికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ కూడా తోడు కావడంతో మంచి స్కోరు నమోదుచేసింది ఎస్ఆర్‌హెచ్. బ్యాటింగ్ ప్రారంభించిన రెండో ఓవర్‌లోనే సూపర్ ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టో వికెట్ కోల్పోయింది సన్‌రైజర్స్. హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో బెయిర్ స్టో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మనీశ్ పాండేతో కలిసి 115 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు డేవిడ్ వార్నర్. 45 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ను కూడా హర్భజన్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. ఓపెనర్లు ఇద్దరూ బజ్జీ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి, పెవిలియన్ చేరడం విశేషం. ఆ తర్వాత విజయ్ శంకర్ 26 పరుగులు చేసి చాహార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 83 పరుగులు చేసిన మనీశ్ పాండే‌తో పాటు యూసఫ్ పఠాన్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఒకానొక దశలో హైదరాబాద్ స్కోరు 200 దాటుతుందని భావించినా, చివరి రెండు ఓవర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన చెన్నై బౌలర్లు ఆ మార్కు దాటనివ్వలేదు. ఐపీఎల్ కెరీర్‌లోనే మొట్టమొదటి సెంచరీ చేసిన భారతీయ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన మనీశ్ పాండే... ఆ తర్వాత ఆటతీరు కనబర్చలేకపోయాడు. మళ్లీ మనీశ్‌లో మునుపటి జోష్ కనిపించింది. అదీగాక ఓపెనర్లు తప్ప, మిడిల్ ఆర్డర్ రాణించడం లేదనే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ బాధను తీర్చేశాడు మనీశ్ పాండే.
Published by: Ramu Chinthakindhi
First published: April 24, 2019, 9:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading