CSK vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ... సన్‌రైజర్స్ బ్యాటింగ్...

కేన్ విలియంసన్‌కు విశ్రాంతి... భువనేశ్వర్ కుమార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు... శార్దూల్ ఠాగూర్ స్థానంలో హర్భజన్ సింగ్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 23, 2019, 8:03 PM IST
CSK vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ... సన్‌రైజర్స్ బ్యాటింగ్...
కేన్ విలియంసన్‌కు విశ్రాంతి... భువనేశ్వర్ కుమార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు... శార్దూల్ ఠాగూర్ స్థానంలో హర్భజన్ సింగ్...
  • Share this:
IPL 2019 Live Score, CSK vs SRH Match at Chennai: చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వరుస విజయాలతో టాప్‌లో కొనసాగిన మహేంద్ర సింగ్ ధోనీ టీమ్‌ వరుసగా రెండు పరాజయాలు చవి చూసింది. యంగ్ టీమ్ ఢిల్లీ జోరు కారణంగా రెండో స్థానానికి పడిపోయింది. మరోవైపు వరుస ఓటములతో ఢీలా పడిన హైదరాబాద్... మంచి పుంజుకుని విజయాల బాట పట్టింది. ఈ ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఘనవిజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో ధోనీ లేకుండా బరిలో దిగింది. ఈసారి ధోనీ కూడా మంచి ఫామ్ మీద ఉండడం సన్‌రైజర్స్ బౌలర్లకు పని పెట్టే విషయం. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఈ మ్యాచ్‌లో బరిలో దిగడం లేదు. అతన స్థానంలో భువనేశ్వర్ కుమార్ జట్టుకు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ధోనీ టీమ్‌ను భువీ టీమ్ ఎంతవరకూ నిలవరిస్తుందోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ విజయం మొత్తం ఓపెనర్లపైనే ఆధారపడుతున్న విషయం తెలిసిందే.

చెన్నై జట్టు: షేన్ వాట్సన్, డుప్లిసిస్, ధోనీ, సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, బ్రావో, దీపక్ చాహార్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహీర్

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, మనీశ్ పాండే, విజయ్ శంకర్, యూసఫ్ పఠాన్, దీపక్ హుడా, షకీబుల్ హాసన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ

First published: April 23, 2019, 7:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading