CSK vs MI: టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై... 12 పరుగులకే 2 వికెట్లు...

12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన చెన్నై సూపర్ కింగ్స్... కేదార్ జాదవ్ స్థానంలో మురళీ విజయ్‌కు అవకాశం ఇచ్చిన ధోనీ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 7, 2019, 7:52 PM IST
CSK vs MI: టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై... 12 పరుగులకే 2 వికెట్లు...
12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన చెన్నై సూపర్ కింగ్స్... కేదార్ జాదవ్ స్థానంలో మురళీ విజయ్‌కు అవకాశం ఇచ్చిన ధోనీ...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 7, 2019, 7:52 PM IST
IPL 2019 CSK vs MI: ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరుగుతున్న క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి క్వాలిఫైయర్‌లో చెరో మూడు సార్లు టైటిల్స్ గెలిచిన చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య పోరుపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై రెండు సార్లు విజయం సాధించి మంచి ఆధిపత్యం కనబర్చింది రోహిత్ టీమ్. క్వాలిఫైయర్ 1లో కూడా అదే జోరు చూపించి, ఫైనల్ చేరాలని భావిస్తోంది ముంబై ఇండియన్స్. మరోవైపు ధోనీ టీమ్ కూడా గ్రూప్ దశలో ఎదురైన ఓటమికి ఫ్లేఆఫ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో తలబడుతుంది. బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైకి ఆరంభంలో గట్టి షాక్ తగిలింది. డుప్లిసిస్ 6 పరుగులు చేసి రాహుల్ చాహార్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరగా, 5 పరుగులు చేసిన సురేశ్ రైనా, జయంత్ యాదవ్ బౌలింగ్‌లోపెవిలియన్ చేరాడు. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది చెన్నై.

ముంబై జట్టు: రోహిత్ శర్మ, బుమ్రా, హర్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషాన్, పొలార్డ్, లసిత్ మలింగ, సూర్యకుమార్ యాదవ్, డి కాక్, రాహుల్ చాహార్, జయంత్ యాదవ్

చెన్నై జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ, డుప్లిసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, షేన్ వాట్సన్, మురళీ విజయ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, హర్భజన్ సింగ్, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహీర్



First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...