CSK vs MI: చెన్నైకి షాక్ ఇచ్చిన ముంబై బౌలర్లు... స్వల్ప స్కోరుకే పరిమితమైన ధోనీ టీమ్...

మరోసారి సత్తాచాటిన మహేంద్ర సింగ్ ధోనీ, అంబటి రాయుడు... దీపక్ చాహార్‌కు రెండు వికెట్లు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 7, 2019, 9:25 PM IST
CSK vs MI: చెన్నైకి షాక్ ఇచ్చిన ముంబై బౌలర్లు... స్వల్ప స్కోరుకే పరిమితమైన ధోనీ టీమ్...
మరోసారి సత్తాచాటిన మహేంద్ర సింగ్ ధోనీ, అంబటి రాయుడు... దీపక్ చాహార్‌కు రెండు వికెట్లు...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 7, 2019, 9:25 PM IST
IPL 2019 Live Score, CSK vs MI Match, Qualifier 1 at Chennai: చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగుల స్వల్ప స్కోరు చేసింది. బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైకి ఆరంభంలో గట్టి షాక్ తగిలింది. డుప్లిసిస్ 6 పరుగులు చేసి రాహుల్ చాహార్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరగా, కొద్దిసేపటికే 5 పరుగులు చేసిన సురేశ్ రైనా, కొత్త కుర్రాడు జయంత్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది చెన్నై. ఆ తర్వాత 10 పరుగులు చేసిన షేన్ వాట్సన్‌ను కృనాల్ పాండ్యా అవుట్ చేశాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ దశలో కేదార్ జాదవ్ స్థానంలో చోటు దక్కించుకున్న మురళీ విజయ్‌తో కలిసి నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు అంబటి రాయుడు. ఇద్దరూ వికెట్లు కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడంతో రన్‌రేట్ బాగా తగ్గింది. ఈ దశలో జోరు పెంచేందుకు ప్రయత్నించిన మురళీ విజయ్, రాహుల్ చాహార్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 26 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు మురళీ విజయ్. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ కూడా ప్రారంభంలో నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా 18 ఓవర్లలో కేవలం 107 పరుగులు మాత్రమే సాధించగలిగింది చెన్నై సూపర్ కింగ్స్.

మలింగ వేసిన 19వ ఓవర్లో దూకుడు పెంచిన మహేంద్ర సింగ్ ధోనీ... రెండు వరుస సిక్సర్లు సాధించి 15 పరుగులు రాబట్టాడు. బుమ్రా వేసిన చివరి ఓవర్‌ మొదటి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించిన ధోనీని...ఇషాన్ కిషన్ అద్భుత క్యాచ్‌తో అవుట్ చేశాడు. అయితే అది నో బాల్ కావడంతో ధోనీకి లైఫ్ లభించింది. అయితే చివరి ఓవర్‌లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ షాట్స్ సాధించేందుకు వీలుకాలేదు. చివరి ఓవర్‌లో 9 పరుగులు మాత్రమే వచ్చాయి. ధోనీ 29 బంతుల్లో 3 సిక్సర్లతో 37 పరుగులు చేయగా, అంబటి రాయుడు 37 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో 42 పరుగులు చేశాడు.

First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...