CSK vs KXIP: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు... పంజాబ్ కింగ్స్ టార్గెట్ 161....

IPL 2019 Live Score, CSK vs KXIP Match in Chennai: మూడు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్... డుప్లిసిస్ హాఫ్ సెంచరీ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 6, 2019, 5:58 PM IST
CSK vs KXIP: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు... పంజాబ్ కింగ్స్ టార్గెట్ 161....
IPL 2019 Live Score, CSK vs KXIP Match in Chennai: మూడు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్... డుప్లిసిస్ హాఫ్ సెంచరీ...
  • Share this:
IPL 2019 Live Score, CSK vs KXIP Match in Chennai: కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 160 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్ గెలిచి, బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు... దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. షేన్ వాట్సన్, డుప్లిసిస్ కలిసి వరుస బౌండరీలు సాధిస్తూ, పంజాబ్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. 5.3 ఓవర్లలోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదుచేశారు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరపున మొదటి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. మొదటి వికెట్‌కు 56 పరుగులు జోడించిన తర్వాత వాట్సన్ అవుట్ అయ్యాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన వాట్సన్... అశ్విన్ బౌలింగ్‌లో సామ్ కుర్రాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించిన డుప్లిసిస్...2 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేసిన డుప్లిసిస్... అశ్విన్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి, అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే 17 పరుగులు చేసిన సురేశ్ రైనాను కూడా బౌల్డ్ చేశాడు అశ్విన్. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ, అంబటి రాయుడు కలిసి చివర్లో దూకుడుగా ఆడి, స్కోర్ 160 పరుగులు దాటించారు. కెప్టెన్ ధోనీ 23 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేయగా... అంబటి రాయుడు 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇద్దరూ 38 బంతుల్లోనే 60 పరుగులు జోడించడం విశేషం.


POINTS TABLE:



SCHEDULE TIME TABLE:


ORANGE CAP:


PURPLE CAP:


RESULTS TABLE:


RCB vs KKR: తొలి విజయం కోసం విరాట్ సేన తహతహ... కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో ఢీ...

IPL 2019: రాయల్ ఛాలెంజర్స్‌ ఈ గతికి కారణమేంటి... విరాట్ సేనకు ఏమైంది...
Published by: Ramu Chinthakindhi
First published: April 6, 2019, 5:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading