CSK vs KXIP: చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం... రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ పోరాటం వృథా...

IPL 2019 Live Score, CSK vs KXIP Match in Chennai: రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీలు... మూడో వికెట్‌కు 110 పరుగులు జోడించిన రాహుల్, సర్ఫరాజ్... 22 పరుగుల తేడాతో చెన్నై జట్టు విజయం...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 6, 2019, 7:46 PM IST
CSK vs KXIP: చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం... రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ పోరాటం వృథా...
IPL 2019 Live Score, CSK vs KXIP Match in Chennai: రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీలు... మూడో వికెట్‌కు 110 పరుగులు జోడించిన రాహుల్, సర్ఫరాజ్... 22 పరుగుల తేడాతో చెన్నై జట్టు విజయం...
  • Share this:
IPL 2019 Live Score, CSK vs KXIP Match in Chennai: 161 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టుకు ఆరంభంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్‌లోనే 5 పరుగులు చేసిన క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్ వికెట్లు కోల్పోయింది పంజాబ్. హర్భజన్ సింగ్ బౌలింగ్‌లో కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చిన గేల్ వెనుదిరగగా... తర్వాత రెండో బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించిన మయాంక్ అగర్వాల్ డుప్లిసిస్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్ జట్టు కష్టాల్లో పడింది. అయితే కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి 14 ఓవర్లలో జట్టు స్కోరు 100 పరుగుల మార్కు దాటించారు. ఈ దశలో సర్ఫరాజ్ ఖాన్ 42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఇది అతనికి తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఆ తర్వాత కొద్దిసేపటికే రాహుల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 41 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్‌తో అర్ధశతకం నమోదుచేశాడు రాహుల్. ఇద్దరూ మూడో వికెట్‌కు 110 పరుగులు జోడించిన తర్వాత భారీ షాట్‌కు ప్రయత్నించిన రాహుల్ (55 పరుగులు), జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. రెండు ఓవర్లలో విజయానికి 39 పరుగులు కావల్సిన దశలో దీపక్ చాహార్ బైలింగ్‌కు దిగాడు. వరుసగా రెండు బౌనర్లు వేసి, ఎక్స్‌ట్రాల రూపంలో 8 పరుగులు సమర్పించాడు. ఆ తర్వాత కేవలం నాలుగు సింగిల్స్ మాత్రమే సమర్పించిన దీపక్ చాహార్... డేవిడ్ మిల్లర్ (6 పరుగులు)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దాంతో చివరి ఓవర్‌లో పంజాబ్ జట్టు విజయానికి 26 పరుగులు కావాలి. అయితే చివరి ఓవర్ వేసిన కుగ్లేజిన్ కట్టుదిట్టంగా బైలింగ్ చేశాడు. మొదటి బంతికి 2 పరుగులు ఇచ్చి, తర్వాత రెండు బంతులకు పరుగులు ఇవ్వకుండా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాడు. నాలుగో బంతికి భారీ సాట్‌కు ప్రయత్నించిన సర్ఫరాజ్ ఖాన్, డుప్లిసిస్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఫలితంగా 22 పరుగుల తేడాతో చెన్నై జట్టుకు ఘనవిజయం దక్కింది.

అంతకు ముందు టాస్ గెలిచి, బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 160 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఓపెనర్లు షేన్ వాట్సన్, డుప్లిసిస్ కలిసి వరుస బౌండరీలు సాధిస్తూ, పంజాబ్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. 5.3 ఓవర్లలోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదుచేశారు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరపున మొదటి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. మొదటి వికెట్‌కు 56 పరుగులు జోడించిన తర్వాత వాట్సన్ అవుట్ అయ్యాడు. 24 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన వాట్సన్... అశ్విన్ బౌలింగ్‌లో సామ్ కుర్రాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించిన డుప్లిసిస్...2 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేసిన డుప్లిసిస్... అశ్విన్ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి, అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే 17 పరుగులు చేసిన సురేశ్ రైనాను కూడా బౌల్డ్ చేశాడు అశ్విన్. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ, అంబటి రాయుడు కలిసి చివర్లో దూకుడుగా ఆడి, స్కోర్ 160 పరుగులు దాటించారు. కెప్టెన్ ధోనీ 23 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేయగా... అంబటి రాయుడు 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇద్దరూ 38 బంతుల్లోనే 60 పరుగులు జోడించడం విశేషం.

POINTS TABLE:


SCHEDULE TIME TABLE:


ORANGE CAP:



PURPLE CAP:


RESULTS TABLE:


RCB vs KKR: తొలి విజయం కోసం విరాట్ సేన తహతహ... కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో ఢీ...

IPL 2019: రాయల్ ఛాలెంజర్స్‌ ఈ గతికి కారణమేంటి... విరాట్ సేనకు ఏమైంది...
Published by: Ramu Chinthakindhi
First published: April 6, 2019, 7:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading