CSK vs DC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ... ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్...

మురళీ కార్తీక్ స్థానంలో శార్దూల్ ఠాగూర్‌కు అవకాశం కల్పించిన ధోనీ... హైదరాబాద్‌తో తలబడిన జట్టుతోనే బరిలో దిగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్... జూనియర్స్ vs సీనియర్స్ సమరంగా భావిస్తున్న ఈ మ్యాచ్‌లో విజయం దక్కిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు ఐపీఎల్ సీజన్ 12లో మూడో స్థానంతో సరిపెట్టుకుంటుంది.

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 10, 2019, 7:30 PM IST
CSK vs DC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోనీ... ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్...
శ్రేయాస్ అయ్యర్, మహేంద్ర సింగ్ ధోనీ
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 10, 2019, 7:30 PM IST
CSK vs DC: చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో 9 సార్లు ఫ్లేఆఫ్స్, 7 సార్లు ఫైనల్ చేరిన జట్టుగా రికార్డు క్రియేట్ చేస్తే.... ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఫైనల్ చేరని ఒకే ఒక్క జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది. లక్ కలిసిరావడం లేదని ఢిల్లీ డేర్‌డెవిల్స్ పేరును కాస్తా ఢిల్లీ క్యాపిటల్స్‌గా మార్చుకుంది. పేరు మారిన తర్వాత లక్ కలిసొచ్చిందో, లేక మంచి ప్లేయర్స్ కారణంగా దూసుకొచ్చిందో తెలీదు కానీ 2012 తర్వాత మొట్టమొదటి సారిగా ఫ్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ. ఫ్లేఆఫ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి, క్వాలిఫైయర్ 2కి అర్హత సాధించింది. అయితే ఫైనల్ చేరాలంటే ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించాల్సి ఉంటుంది. గ్రూప్ దశలో జరిగిన రెండు మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ చేతిలో చిత్తుగా ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్. క్వాలిఫైయర్ 2లో ఎలాంటి పోటీనిస్తుందో చూడాలి. జూనియర్స్ vs సీనియర్స్ సమరంగా భావిస్తున్న ఈ మ్యాచ్‌లో విజయం దక్కిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఓడిన జట్టు ఐపీఎల్ సీజన్ 12లో మూడో స్థానంతో సరిపెట్టుకుంటుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కోలిన్ మున్రో, రూథర్‌ఫర్డ్, అక్షర్ పటేల్, కిమో పాల్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, ట్రెంట్ బోల్ట్

చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, డుప్లిసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, శార్దూల్ ఠాగూర్, రవీంద్ర జడేజా, డ్రేన్ బ్రావో, ధోనీ, దీపక్ చాహార్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహీర్

IPL 2019: సీనియర్స్ vs జూనియర్స్... చెన్నైని ఢీకొట్టే సత్తా యంగ్ ఢిల్లీకి ఉందా...


First published: May 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...