ఫైనల్ నెం.8... మళ్లీ ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్... ఢిల్లీ క్యాపిటల్స్‌ని చిత్తు చేసి ముంబైతో ఫైనల్‌‌కి రెఢీ...

డుప్లిసిస్, షేన్ వాట్సన్ హాఫ్ సెంచరీలు... 8వ సారి ఫైనల్ చేరిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రికార్డు... నాలుగోసారి ఫైనల్‌లో తలబడబోతున్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్... మే 12 ఆదివారం ఐపీఎల్ బిగ్ ఫైనల్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 11, 2019, 9:58 AM IST
ఫైనల్ నెం.8... మళ్లీ ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్... ఢిల్లీ క్యాపిటల్స్‌ని చిత్తు చేసి ముంబైతో ఫైనల్‌‌కి రెఢీ...
సురేశ్ రైనా
  • Share this:
IPL 2019 Live Score, CSK vs DC Match, Qualifier 2 at Visakhapatnam: ఐపీఎల్ సీజన్ 12 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ఆసక్తికర పోరు ఊహించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. అద్భుత ఆటతీరుతో ఫ్లేఆఫ్స్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మ్యాచ్‌లో ఒత్తిడికి లోనై మ్యాచ్‌ను కోల్పోయారు. ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి ఫైనల్ చేరాలనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలపై అత్యధిక సార్లు ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ నీళ్లు పోసింది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ఆరు వికెట్లతో అద్భుత విజయాన్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 8వ సారి ఫైనల్ చేరింది. మూడు సార్లు టైటిల్ నెగ్గిన ధోనీ టీమ్... మూడు టైటిల్స్ సమానంగా ఉన్న రోహిత్ టీమ్‌తో ఫైనల్‌లో తలబడబోతోంది. సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విధించిన 148 పరుగుల విజయలక్ష్యాన్ని 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది చెన్నై సూపర్ కింగ్స్. డుప్లిసిస్, షేన్ వాట్సన్ ఆరంభం నుంచి అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. భారీ షాట్లకు ప్రయత్నించకుండా నిలకడగా ఆడారు. దాంతో 10.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 81 పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ దశలో 39 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న డుప్లిసిస్‌ను బౌల్ట్ అవుట్ చేశాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మరో ఓపెనర్ షేన్ వాట్సన్, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సురేశ్ రైనా 11, ధోనీ 9 పరుగులు చేసి అవుట్ అయినా 20 పరుగులు చేసిన అంబటి రాయుడు లాంఛనాన్ని పూర్తిచేశాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 147 పరుగుల స్పల్ప స్కోరు నమోదుచేసింది. పటిష్ట ప్రత్యర్థితో ఆడుతున్నామనే ఒత్తిడికి గురైన యంగ్ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. శిఖర్ ధావన్, పృథ్వీషా, శ్రేయాస్ అయ్యర్ వంటి స్టార్స్ కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో చెన్నై ముందు ఓ మాదిరి స్కోరు మాత్రమే ఉంచగలిగింది. 8వ సారి ఫైనల్ చేరాలని ఆశిస్తున్న ధోనీ టీమ్‌ టార్గెట్ 148ను చేధిస్తుందో లేక ఢిల్లీ టీమ్ బౌలర్లు ప్రత్యర్థిని నిలువరించగలుగుతారో చూడాలి. బ్యాటింగ్ ప్రారంభించిన మూడో ఓవర్‌లోనే యంగ్ సన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న దీపక్ చాహార్ ఢిల్లీ గట్టి షాక్ ఇచ్చాడు. 5 పరుగులు చేసి పృథ్వీషా అవుట్ కాగా, ఆ తర్వాత కొద్దిసేపటికే శిఖర్ ధావన్ 18 పరుగులు, కోలిన్ మున్రో 27 పరుగులు, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 13 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. అక్షర్ పటేల్ కూడా 3 పరుగులకే పెవిలియన్ చేరడంతో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. రూథర్డ్‌ఫర్డ్‌తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు రిషబ్ పంత్. అయితే హర్భజన్ బౌలింగ్‌లో షేన్ వాట్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు రూథర్డ్‌ఫర్డ్. కిమో పాల్ కూడా 3 పరుగులకే అవుట్ అయ్యాడు.

ఓ వైపు వికెట్లు పడుతున్నా వేగంగా బ్యాటింగ్ చేశాడు రిషబ్ పంత్. 25 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 38 పరుగులు చేసిన రిషబ్ పంత్, దీపక్ చాహార్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డ్వేన్ బ్రావోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. బౌల్ట్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా ఆఖరి ఓవర్‌లో బౌండరీలు సాధించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆ మాత్రం స్కోరు అయినా సాధించగలిగింది. బౌల్డ్ 6 పరుగులు చేసి అవుట్ కాగా, అమిత్ మిశ్రా 6, ఇషాంత్ శర్మ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీపక్ చాహార్‌, హర్భజన్ సింగ్, డ్వేన్ బ్రావోలకు రెండేసి వికెట్లు దక్కగా, ఇమ్రాన్ తాహీర్, రవీంద్ర జడేజాలకు చెరో వికెట్ దక్కాయి.
First published: May 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading