CSK vs DC: ధోనీ, రైనా మెరుపులు... భారీ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్...

IPL 2019 Live Score, CSK vs DC Match at Chennai: సురేశ్ రైనా హాఫ్ సెంచరీ... 44 పరుగులు చేసిన ధోనీ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 1, 2019, 9:41 PM IST
CSK vs DC: ధోనీ, రైనా మెరుపులు... భారీ స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్...
IPL 2019 Live Score, CSK vs DC Match at Chennai: సురేశ్ రైనా హాఫ్ సెంచరీ... 44 పరుగులు చేసిన ధోనీ...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 1, 2019, 9:41 PM IST
IPL 2019 Live Score, CSK vs DC Match at Chennai: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 179 పరుగుల భారీ స్కోరు చేసింది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలించడంతో పరుగులు రాబట్టడానికి చెన్నై బ్యాట్స్‌మెన్ బాగా కష్టపడ్డారు. 3.2 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ దశలో 9 బంతులు ఆడి, పరుగులేమీ చేయలేకపోయిన షేన్ వాట్సన్...జగదీశ్ సుచిత్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనాతో కలిసి డుప్లిసిస్ నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. ఇద్దరూ పరుగులు సాధించడానికి కష్టపడడంతో రన్‌రేట్ నెమ్మదించింది. 14వ ఓవర్‌లో రన్‌రేట్ పెంచేందుకు భారీ సిక్సర్ సాధించిన డుప్లిసిస్... ఆ తర్వాతి బంతిని కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి, బౌండరీ లైన్ దగ్గర శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 41 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు డుప్లిసిస్. ఆ తర్వాత భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు సురేశ్ రైనా. జగదీశ్ సుచిత్ బౌలింగ్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లు కొట్టిన రైనా...తర్వాతి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించి, ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 37 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్స్‌తో 59 పరుగులు చేశాడు సురేశ్ రైనా.

ఆ తర్వాత ధోనీ, జడేజా కలిసి వేగంగా పరుగులు రాబట్టారు. 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 25 పరుగులు చేసిన జడేజా...క్రిస్‌మోరిస్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే అదే ఓవర్‌లో ఫోర్, సిక్సర్ బాది 18 పరుగులు రాబట్టారు అంబటి రాయుడు, ధోనీ. చివరి ఓవర్లో ఈ ఇద్దరూ ఏకంగా 21 పరుగులు రాబట్టడంతో 179 పరుగుల భారీ స్కోరు చేసింది చెన్నై. ధోనీ 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు ధోనీ.

First published: May 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...