CSK vs DC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్... చెన్నై బ్యాటింగ్...

టాప్ ప్లేస్ కోసం ఢిల్లీ, చెన్నై మధ్య సమరం... గెలిచిన జట్టుకు టాప్ ప్లేస్... ధోనీ టీమ్‌కు టఫ్ ఛాలెంజ్ విసురుతున్న యంగ్ ఢిల్లీ...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 1, 2019, 7:56 PM IST
CSK vs DC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్... చెన్నై బ్యాటింగ్...
టాప్ ప్లేస్ కోసం ఢిల్లీ, చెన్నై మధ్య సమరం... గెలిచిన జట్టుకు టాప్ ప్లేస్... ధోనీ టీమ్‌కు టఫ్ ఛాలెంజ్ విసురుతున్న యంగ్ ఢిల్లీ...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: May 1, 2019, 7:56 PM IST
CSK vs DC: చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేయనుంది. ప్రత్యర్థి వేదికపై ఆడిన 6 మ్యాచుల్లో 5 మ్యాచులు గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు జట్లు కూడా 8 విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌ 1,2లో కొనసాగుతున్నాయి. రన్‌రేట్ కారణంగా ఢిల్లీ టాప్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళుతుంది. యంగ్ టీమ్‌గా సీజన్‌ను ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్... అంచనాలను మించి రాణించింది. శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యార్, రిషబ్ పంత్, పృథ్వీషా... అందరూ అద్భుతంగా రాణిస్తున్నారు. చెన్నై టీమ్‌లో కూడా షేన్ వాట్సన్, డుప్లిసిస్, సురేశ్ రైనాతో పాటు మహేంద్ర సింగ్ ధోనీ మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే ధోనీ ఆరోగ్య పరిస్థితిపై మ్యాచ్‌కు ముందు కాస్త సస్పెన్స్ నెలకొంది. అయినా తుదిజట్టులో ధోనీ ఉండడంతో చెన్నై ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: పృథ్వీషా, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కోలిన్ ఇన్‌గ్రామ్, రూథర్‌ఫర్డ్, అక్షర్ పటేల్, జగదీశ్ సుచిత్, సందీప్ లామిచానే, అమిత్ మిశ్రా, ట్రెంట్ బోల్ట్

చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, డుప్లిసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, డ్రేన్ బ్రావో, ధోనీ, దీపక్ చాహార్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహీర్,



First published: May 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...