MI vs KXIP: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై... రోహిత్ శర్మ మిస్...

IPL 2019 Live Cricket Score, MI vs KXIP Match at Wankhede: రోహిత్ శర్మ స్థానంలో పొలార్డ్‌కు నాయకత్వ బాధ్యతలు... బెస్ట్ ఫ్రెండ్స్ హర్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ ప్రత్యర్థులుగా బరిలో...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 10, 2019, 7:45 PM IST
MI vs KXIP: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై... రోహిత్ శర్మ మిస్...
IPL 2019 Live Cricket Score, MI vs KXIP Match at Wankhede: రోహిత్ శర్మ స్థానంలో పొలార్డ్‌కు నాయకత్వ బాధ్యతలు... బెస్ట్ ఫ్రెండ్స్ హర్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ ప్రత్యర్థులుగా బరిలో...
  • Share this:
IPL 2019 Live Cricket Score, MI vs KXIP Match at Wankhede: పంజాబ్ కింగ్స్ ఎలెవన్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు సారథి ఉదయం ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. అతను ఈ మ్యాచ్‌లో బరిలో దిగడం లేదు. రోహిత్ స్థానంలో సిద్ధేశ్ ల్యాండ్ ముంబై జట్టు తరుపు ఆరంగ్రేటం చేయనున్నాడు. మూడు సీజన్ల నుంచి సిద్ధేశ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. రోహిత్ శర్మ స్థానంలో పొలార్డ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం స్వదేశానికి వెళ్లిన శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగ మళ్లీ తిరిగొచ్చి, జట్టుతో కలిశాడు. మలింగ రాకతో ముంబై జట్టుకు అదనపు బలం చేకూరినట్టైంది. అయితే అతనికి తుది జట్టులో స్థానం దక్కలేదు. ఇదిలా ఉంటే ‘కాఫీ విత్ కరణ్’ షో కారణంగా వివాదాల్లో కూరుకుపోయిన బెస్ట్ ఫ్రెండ్స్ హర్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా బరిలో దిగుతుండడం ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చిన అల్జరీ జోసఫ్... హైదరాబాద్‌పై ఆరు వికెట్లు తీసి, సంచలన ప్రదర్శన ఇచ్చాడు. గేల్, రాహుల్, డేవిడ్ మిల్లర్ వంటి భారీ హిట్టర్లు ఉన్న పంజాబ్, అతన్ని ఎలా ఎదుర్కుంటుదనేది ఆసక్తికరంగా మారింది.

పంజాబ్ జట్టు: క్రిస్ గేల్, రాహుల్, కరణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మన్‌దీప్ సింగ్, సామ్ కుర్రాన్, అశ్విన్, హర్దుస్ విల్జీన్, షమీ, అంకిత్ రాజ్‌పుత్

ముంబై జట్టు: డి కాక్, సిద్ధేశ్ ల్యాడ్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పోలార్డ్, కృనాల్ పాండ్యా, హర్ధిక్ పాండ్యా, రాహుల్ చాహార్, అల్జరీ జోసఫ్, బుమ్రా, జాసన్ బెహ్రాన్‌డాఫ్

First published: April 10, 2019, 7:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading