IPL 2019 final : ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్స్ దందా.. దిమ్మతిరిగే రేట్లు..
IPL 2019 Final : ఇప్పటికే మూడు సార్లు కప్‌ను ఎగరేసుకెళ్లిన ఈ రెండు జట్లలో.. నాలుగోసారి అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
news18-telugu
Updated: May 12, 2019, 6:12 PM IST

ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం (ఫైల్ ఫోటో)
- News18 Telugu
- Last Updated: May 12, 2019, 6:12 PM IST
హైదరాబాద్ ఐపీఎల్ ఫీవర్‌తో ఊగిపోతోంది. ముంబై ఇండియన్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇదే అదునుగా భావించి కొంతమంది దందా రాయుళ్లు మ్యాచ్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నవాళ్లకు, బుకింగ్ కౌంటర్స్ వద్ద గంటల కొద్ది పడిగాపులు కాచినవాళ్లకు ఇంతవరకు టికెట్లు చేతికి అందలేదు. కానీ స్టేడియం బయటే కొంతమంది యథేచ్చగా బ్లాక్ టికెట్లు విక్రయిస్తుండటం గమనార్హం.
స్టేడియం చుట్టూ వందలకొద్ది పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెబుతున్నప్పటికీ.. అక్కడి పరిసరాల్లోనే బ్లాక్ టికెట్ల విక్రయం జోరుగా సాగుతోంది. రూ.1వెయ్యి టికెట్‌ను రూ.5వేలు, రూ.2వేల టికెట్‌ను రూ.10వేలకు విక్రయిస్తున్నారు. నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వచ్చిన కొంతమంది టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నారు. టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తుండటంపై క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తిని ఇలా క్యాష్ చేసుకోవడంపై మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ ఫైట్‌లో ఎవరు గెలవబోతున్నారన్న దానిపై ఎవరికి తోచిన అంచనాలు వారు వినిపిస్తున్నారు. ధోనీ ఫ్యాన్స్ అంతా చెన్నై గెలవాలని కోరుకుంటుండగా.. రోహిత్ శర్మ ఫ్యాన్స్ అంతా ముంబై ఇండియన్స్ గెలవాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే మూడు సార్లు కప్‌ను ఎగరేసుకెళ్లిన ఈ రెండు జట్లలో.. నాలుగోసారి అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ప్యాంటు తడిచేలా రక్తం కారుతున్నా... బ్యాటింగ్ వదలని వాట్సన్
IPL 2019 Final: ధోని రనౌట్ నిర్ణయం తప్పేనా?.. అప్పడు ఏం జరిగింది?
IPL Final: అంపైర్ నిర్ణయాన్ని అవహేళన చేశాడు.. దెబ్బకు ఆ క్రికెటర్‌కు..
IPL: ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై సూపర్‌కింగ్స్ ఓడింది అందుకేనా..
IPL 2019 Final Live Score, MI vs CSK : ఐపీఎల్ 2019 విజేత ముంబై ఇండియన్స్...ఉత్కంఠభరిత మ్యాచ్ గెలుపుతో నాలుగో సారి టైటిల్ సొంతం
MI Vs CSK : ఇద్దరిలో ఇప్పటివరకు ఎవరెన్నిసార్లు కప్ ఎగరేసుకెళ్లారు?
Loading...