MI vs CSK IPL 2019 Final | అంపైర్ తీరుపై పొలార్డ్ ఆగ్రహం.. గాల్లోకి బ్యాట్ ఎగరేసి..

బ్రావో వేసిన బాల్‌ వైడ్ వెళ్లినా.. దాన్ని వైడ్‌గా ప్రకటించకపోవడంతో నిరసన తెలిపాడు. తన బ్యాట్‌ను గాల్లోకి ఎగరేసి అంపైర్ల తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశాడు.

news18-telugu
Updated: May 12, 2019, 10:59 PM IST
MI vs CSK IPL 2019 Final | అంపైర్ తీరుపై పొలార్డ్ ఆగ్రహం.. గాల్లోకి బ్యాట్ ఎగరేసి..
పొలార్డ్‌తో చర్చిస్తున్న అంపైర్లు (Image:IPL)
news18-telugu
Updated: May 12, 2019, 10:59 PM IST
ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాడు పొలార్డ్.. ఐపీఎస్ అపైంర్ల తీరుపై నిరసన వ్యక్తం చేశాడు. బ్రావో వేసిన బాల్‌ వైడ్ వెళ్లినా.. దాన్ని వైడ్‌గా ప్రకటించకపోవడంతో నిరసన తెలిపాడు. తన బ్యాట్‌ను గాల్లోకి ఎగరేసి అంపైర్ల తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చివరి రెండు ఓవర్లలో స్కోర్ చేయడానికి పొలార్డ్ బాగా ఇబ్బంది పడ్డాడు. 19వ ఓవర్లో పరుగులు చేయలేకపోయాడు. ఎనిమిది డాట్ బాల్స్ ఆడాడు. 20వ ఓవర్లో మూడో బాల్‌ను వైడ్‌ అయినా, అంపైర్ నితిన్ మీనన్ దాన్ని వైడ్‌గా అనౌన్స్ చేయకపోవడంతో పొలార్డ్ అసంతృప్తికి గురయ్యాడు. ఆ తర్వాత బాల్‌ వేస్తున్న సమయంలో వికెట్లకు దూరంగా జరిగిపోయాడు. దీంతో బౌలింగ్ చేస్తున్న బ్రావో రనప్ మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన అంపైర్లు నితిన్ మీనన్, ఇయాన్ గోల్డ్‌లు వెళ్లి పొలార్డ్‌తో చర్చించారు. ఆ తర్వాత రెండు బాల్స్‌ రెండు ఫోర్లు కొట్టడంతో ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 149 పరుగులు గౌరవప్రదరమైన స్కోర్ చేయగలిగింది.

First published: May 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...